చిరంజీవే తన వెంట పడాలని కోరిన నటి

0

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో క్లాసిక్ హిట్ గా నిలిచిన చిత్రాల్లో `కొండవీటి దొంగ`(1990) చెప్పుకోదగ్గది. ఈ సినిమాలో విజయశాంతి – రాధ కథానాయికలుగా నటించగా.. శారద – శ్రీవిద్య లాంటి వెటరన్స్ కీలక పాత్రల్లో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి పరుచూరి బ్రదర్స్ మాటలు కథ- అందించారు. కోదండ రామిరెడ్డి దర్శకథ్వంలో త్రివిక్రమరావు నిర్మించారు. కొండవీటి దొంగ రిలీజై మూడు దశాబ్ధాలైంది. ఈ సందర్భంగా 90లలో క్లాసిక్ మ్యూజికల్ హిట్ చిత్రంగా నిలిచిన ఈ మూవీ మేకింగ్ సీక్రెట్స్ ని పరుచూరి పలుకులు యూట్యూబ్ చానెల్లో పరుచూరి గోపాలకృష్ణ వెల్లడించారు.

తొలుత ఈ సినిమాలో చిరంజీవి సరసన కథానాయికగా నటించాల్సిందిగా అతిలోక సుందరి శ్రీదేవిని దర్శకనిర్మాతలు సంప్రదించగా.. ముందు టైటిల్ మార్చాలని.. అలాగే చిరంజీవి తన వెంట పడేలా నాయకానాయికల పాత్రల్లో మార్పులు చేయాలని సూచించారట. ఇంతకీ శ్రీదేవి టైటిల్ ఏమని సూచించారు అంటే.. `కొండవీటి రాణి కొండవీటి దొంగ` అని మార్చమన్నారట. అంతేకాదు కథ ప్రకారం.. హీరోనే తనని ప్రేమిస్తూ వెంటపడాలని ఆ మేరకు మార్పులు చేర్పులు చేయాలని రచయిత సహా దర్శకనిర్మాతలకు సూచించారట. అయితే అందుకు నిర్మాత త్రివిక్రమరావు ససేమిరా అన్నారు. చిరంజీవి అంత పెద్ద స్టార్ ఇలా చేయడం సరికాదని.. కథను మార్చడం కుదరదని చెప్పేశారట.

ఆ తర్వాత శ్రీదేవి స్థానంలో ఇతర స్టార్లను ఎంపిక చేసుకున్నారు. ఒక ఐఏఎస్ అధికారి దొంగగా మారడం అనే కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించామని అప్పట్లో ఈ తరహా కథాంశం యూనిక్ అని పరుచూరి పలుకుల్లో గోపాలకృష్ణ వెల్లడించారు. అప్పట్లోనే ఓ సందర్భంలో కొండవీటి దొంగ సెట్స్ కి వచ్చిన అల్లు రామలింగయ్య `పోయింది.. స్టేట్ రౌడీ పోయింది` అంటూ భయపెట్టేశారని .. అయితే ఆ తర్వాత శశిభూషణ్ వచ్చి `స్టేట్ రౌడీ` కలెక్షన్లు అదిరిపోయాయని చెప్పాకే ధీమా వచ్చిందని పరుచూరి వెల్లడించారు. ఇక ఆ రోజుల్లో ఇలాంటి దుష్ప్రచారం మరీ ఎక్కువగా ఉండేదని కూడా పరుచూరి చెప్పడం విశేషం. పరుచూరి చెప్పిన దానిని బట్టి శ్రీదేవి రేంజ్ స్టార్లు కథల్లో క్రియేటివిటీ వేలు పెట్టడం చాలా కామన్ అని క్లారిటీ వచ్చేసినట్టేనేమో!
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-