నటి సంజనతో మాజీ ఎమ్మెల్యే కొడుకు అసభ్య ప్రవర్తన.. కేసు నమోదు

0

ఓ మాజీ ఎమ్మెల్యే కుమారుడు తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ బిగ్‌బాస్ కంటెస్టెంట్, నటి సంజన పోలీసులకు ఫిర్యాదు చేశారు. పటాన్‌చెరు మాజీ ఎమ్మెల్వే నందీశ్వర్‌గౌడ్‌ కుమారుడు‌ ఆశిష్ గౌడ్‌పై శనివారం రాత్రి పబ్‌‌లో అసభ్యంగా ప్రవర్తించాడని ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మాదాపూర్ ఎస్సై వెంకటరెడ్డి చెప్పారు.ఆశిష్ గౌడ్ ఫుల్లుగా మద్యం సేవించి పబ్బులో అమ్మాయిలను చితకబాది అడ్డువచ్చిన వారిపై చేయి చేసుకున్నాడని ఫిర్యాదులో తెలిపింది.

మాదాపూర్‌లోని హైటెక్స్‌లోని నోవాటెల్ హోటల్లో శనివారం రాత్రి ఆశిష్ హల్‌చల్ చేసినట్టు నటి సంజన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కుమారుడు తన పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాదు, అభ్యంతరకరమైన పదజాలం ఉపయోగించాడని ఫిర్యాదు చేసింది. తన ఫ్రెండ్స్‌తో కలిసి వచ్చి నోటికొచ్చిన బూతులు మాట్లాడినట్టు వివరించింది. మద్యం మత్తులో మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తూ ఫ్రెండ్స్‌తో కలిసి హంగామా చేశాడని, వెకిలివేషాలు వేశాడని ఆరోపించింది. సంజన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదుచేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
Please Read Disclaimer