పవన్27 : ఈసారి ఆమె ఒప్పుకుందట

0

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమాను చేస్తున్నాడు. వచ్చే నెలలో పవన్ 27వ సనిమా క్రిష్ దర్శకత్వంలో ప్రారంభం కాబోతుంది. వకీల్ సాబ్ విడుదలకు ముందే క్రిష్ మూవీకి సంబంధించిన చిత్రీకరణ ప్రారంభించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు జరిగాయి. కరోనా వచ్చి ఉండకుంటే ఇప్పటికే పవన్ క్రిష్ కాంబో మూవీ పూర్తి అయ్యి ప్రేక్షకుల ముందుకు కూడా వచ్చేదేమో. ఆలస్యం విషయం పక్కకు పెడితే ఈ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవి కనిపించబోతుంది అంటూ గతంలో వార్తలు వచ్చాయి. కాని సాయి పల్లవి ఇంతకు ముందు క్రిష్ ఆఫర్ ను తిరష్కరించింది.

పాత్ర నచ్చక పోవడంతో ఆమె నో చెప్పిందనే వార్తలు వచ్చాయి. తాజాగా మరోసారి కథ మరియు పాత్రలో చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసి ఆమెకు వినిపించడంతో ఈసారి ఓకే చెప్పిందట. జమీందార్ కూతురు పాత్రలో సాయి పల్లవి కనిపించబోతున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఈ సినిమాలో నటించే అవకాశాలు ఉన్నాయి అంటూ బలంగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు ఆ విషయమై క్లారిటీ రాలేదు.

వచ్చే నెల షూటింగ్ మొదలు అయితే అప్పుడు హీరోయిన్స్ విషయంలో ఒక స్పష్టత అనేది వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. సాయి పల్లవి ప్రస్తుతం టాలీవుడ్ లో మూడు నాలుగు సినిమాల్లో నటిస్తున్న విషయం తెల్సిందే. ఆమె పవన్ సినిమాలో నటించబోతున్న నేపథ్యంలో ఆమె కెరీర్ మరింత పీక్స్ కు వెళ్తుందనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు.