పవన్.. క్రిష్ మూవీ బడ్జెట్ అంతా?

0

సినిమాలు మాత్రమే తీసే సమయంలోనూ ఒకేసారి రెండు సినిమాలు చేసింది లేదు పవన్ కల్యాణ్. అలాంటిది సినిమాలకు గుడ్ బై చెప్పేశా.. ఇక ఫోకస్ అంతా సినిమాల మీదనే అంటూ చెప్పిన పవన్.. ఇప్పుడు ఏకంగా రెండు సినిమాలకు ఓకే చెప్పటం ఆసక్తికరంగా మారింది. ఆయన మాటల్ని పక్కన పెడితే.. తమ అభిమాన కథానాయకుడు ఏకంగా రెండు సినిమాలు చేయటం పైన పండుగ చేసుకుంటున్నారు పవన్ ఫ్యాన్స్.

దిల్ రాజు నిర్మిస్తున్న హిందీ పింక్ రీమేక్ షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ కావటం.. అందులో పవన్ పాల్గొనటం తెలిసిందే. దీనికి సంబంధించిన పిక్స్ లీకై సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో దిల్ రాజు టీం ఇలాంటి పరిస్థితి మరోసారి చోటు చేసుకోకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. ఈ సినిమా బడ్జెట్ పెద్దగా లేకున్నా.. షూట్ కోసం పవన్ కోసం ఏర్పాటు చేస్తున్న స్పెషల్ ఫ్టైట్స్ కోసమే తడిచి మోపెడు అవుతుందన్న మాట వినిపిస్తోంది.

దిల్ రాజు సినిమాకు కేవలం పాతిక రోజుల కాల్షీట్లు ఇచ్చిన పవన్.. ఆ చిత్రం పూర్తి అయిన వెంటనే.. క్రిష్ మూవీలో పని చేస్తారని చెబుతున్నారు. ఈ సినిమా బడ్జెట్ ఎంతన్న దానిపై ఆసక్తికర సమాచారం తాజాగా బయటకు వచ్చింది. స్వాతంత్య్రానికి ముందు జరిగిన కథాంశంతో ఈ సినిమా ఉంటుందని చెబుతున్నారు. దీని బడ్జెట్ రూ.100 కోట్లకు పైనే ఉంటుందని చెబుతున్నారు. పాతిక కోట్లు పెట్టి భారీ సెట్టింగ్ కూడా వేస్తున్నట్లు తెలుస్తోంది.

తక్కువ సమయంలో రీజనబుల్ బడ్జెట్ లో ఇప్పటికే గౌతమి పుత్ర శాతకర్ణి.. మణికర్ణిక లాంటి సినిమాలు తీసి.. తనను తాను ఫ్రూవ్ చేసుకున్న క్రిష్ అయితే ఈ సినిమాను బాగా డీల్ చేస్తాడన్న ఉద్దేశంతోనే ఇంత భారీగా ఖర్చు చేస్తారని చెబుతున్నారు. ఫిబ్రవరి 4న ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని.. తొలి షెడ్యూల్ ను పవన్ లేకుండానే పూర్తి చేస్తారని చెబుతున్నారు. ఈ సినిమా కోసం హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ సెట్టింగ్ వేయనున్నారట. అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే ఈ మూవీని 2021 సంక్రాంతికి విడుదల చేయాలన్నది ప్లాన్ గా చెబుతున్నారు. పాన్ ఇండియాగా ఈ మూవీని తీర్చిదిద్దటం ద్వారా.. పెట్టిన పెట్టుబడిని ఈజీగా రాబట్టుకోవచ్చన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
Please Read Disclaimer