‘సైరా’ కోసం పవన్-ప్రభాస్ రాక నిజమేనా?

0

మెగాస్టార్ చిరంజీవి 151వ ప్రతిష్టాత్మక ‘సైరా నరసింహారెడ్డి’ విడుదలకు సిద్దం అవుతుంది. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్బంగా భారీ ఎత్తున విడుదలకు రెడీ అయ్యింది. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టిన చిత్ర యూనిట్ సభ్యులు వచ్చే నెలలో రెండవ లేదా మూడవ వారంలో ప్రీ రిలీజ్ వేడుకను అత్యంత వైభవంగా హైదరాబాద్ లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఆ మెగా వేడుకకు పవన్ కళ్యాణ్ మరియు సాహో స్టార్ ప్రభాస్ లు హాజరు అయ్యే అవకాశాలున్నాయని ఇంకా పలువురు మెగా హీరోలు కూడా హాజరు కాబోతున్నట్లుగా పుకార్లు గుప్పుమంటున్నాయి.

పవన్ కళ్యాణ్ ఇప్పటికే సినిమాకు వాయిస్ ఓవర్ ఇవ్వడంతో పాటు నిన్న జరిగిన చిరంజీవి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నాడు. నిన్న అన్నయ్య పుట్టిన రోజు వేడుకలో మాట్లాడుతూ సైరా చిత్రంను పవన్ ఆకాశానికి ఎత్తేశాడు. సైరాపై అంచనాలు పెంచేలా మాట్లాడాడు. మళ్లీ మళ్లీ సైరా కోసం పవన్ వస్తే బాగోదనే ఉద్దేశ్యంతో మెగా కాంపౌండ్ ఉంది. అందుకే ప్రీ రిలీజ్ వేడుకకు పవన్ హాజరు అవ్వనున్నాడు అంటూ ప్రచారం జరగడం కేవలం పుకారు మాత్రమే అని అలాంటి ఉద్దేశ్యం ఏమీ లేదన్నట్లుగా మెగా పీఆర్ టీం అనధికారికంగా చెప్పుకొచ్చింది.

ఇక ప్రభాస్ సైరా ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొంటాడు అంటూ వస్తున్న వార్తలు కూడా నిజం కాకపోవచ్చు అంటున్నారు. అసలు ఈ విషయమై ఎలాంటి చర్చ కూడా మెగా కాంపౌండ్ లో జరిగినట్లుగా సమాచారం లేదు. సైరా పీఆర్ టీం వారు కూడా ఈ విషయాన్ని అనఫిషియల్ గా కొట్టి పారేశారు. ప్రభాస్ ప్రస్తుతం సాహోతో చాలా బిజీగా ఉన్నాడు. ఈనెల 30న సినిమా విడుదల కాబోతుంది. విడుదలైన తర్వాత కూడా ప్రభాస్ ప్రమోషన్స్ లో పాల్గొనడం జరుగుతుంది. అలాంటప్పుడు ‘సైరా’ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో ఆయన ఎలా పాల్గొంటాడు. సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారం కేవలం పులిహోర ప్రచారమే అనిపిస్తుంది.
Please Read Disclaimer