అమరావతిపై మోడీషాలను కలుస్తా: పవన్

0

రాజధాని అమరావతిపై మంత్రులు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం సరికాదని.. మంత్రులు సంయమనం పాటించాలని జనసేనాని పవన్ కళ్యాన్ సూచించారు. రాజధానిపై మంత్రుల మాటలతో ఇంత గందరగోళం నెలకొందని.. దీనిపై క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత సీఎం జగన్ పై ఉందని పవన్ సూచించారు. ఇప్పటికైనా ప్రభుత్వంలో చలనం రాకపోతే ప్రధాని నరేంద్రమోడీ హోంశాఖ మంత్రి అమిత్ షాను కలుస్తానని పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు.

అమరావతి రాజధాని మార్పుపై వస్తున్న ఊహాగానాల నేపథ్యం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ శుక్రవారం నిడమర్రు – కురగల్లు – ఐనవోలు – అనంతవరం – దొండపాడు తదితర అమరావతికి రైతులు భూములు ఇచ్చిన గ్రామాల్లో పర్యటించారు. రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. వారినుంచి వినతిపత్రాలు స్వీకరించారు. తమను ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందని రాజధాని నిర్వాసిత రైతులు పవన్ కు మొరపెట్టుకున్నారు.

ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ రాజధానిపై మంత్రులు ఇష్టం వచ్చినట్టు ప్రకటనలు చేయడంతో తాము ఇబ్బందుల పాలవుతున్నామని తెలిపారు. గ్రామాల్లో తాగునీటి వసతులు లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. అమరావతి రాజధాని తరలిపోతున్నట్టు వస్తున్న వార్తలపై గందరగోళానికి గురవుతున్నట్టు పవన్ కు మొరపెట్టుకున్నారు.

ఇక రైతుల సమస్యలను సావధానంగా విన్న పవన్ కళ్యాణ్ ఆందోళన చెందవద్దని.. రైతుల పక్షాన తాను ఉంటానని హామీ ఇచ్చారు.. రైతుల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. రాజధానిపై మంత్రులు సంయమనం పాటించాలని సూచించారు. బొత్స ఆరోపించినట్టు తాను అమరావతిలో రాజధాని వద్దని ఏనాడు చెప్పలేదని.. రైతుల నుంచి బలవంతంగా భూములను లాక్కోవద్దని మాత్రమే చెప్పానని గుర్తు చేశారు. ఇప్పటికే రాష్ట్ర విభజనతో తీవ్రంగా నష్టపోయామని.. ఇప్పుడు ఇలాంటి గందరగోళ నిర్ణయాలతో మరింత నష్టం చేకూరుతుందని అన్నారు.

సీఎం జగన్ మంత్రులు ఇలాంటి గందరగోళ నిర్ణయాలు తీసుకొని నష్టం చేస్తామంటే తాను బలమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ఈ తీరు మారకుండా ఢిల్లీ వెళ్లి తేల్చుకుంటానని రాష్ట్రంలోని సమస్యలు – పరిస్థితులను మోడీషాలకు వారికి వివరిస్తానని స్పష్టం చేశారు.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home