చిరు తుపాకీతో పవన్ ఎందుకు కాల్చుకోవాలనుకున్నారు?

0

పవన్ కున్న అభిమాన గణం గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సినిమాల్లోకి వచ్చిన పవన్ పవర్ స్టార్ కాకముందు ఆయన జీవితం ఎలా ఉండేది? ఆయన ఆలోచనలు ఎలా ఉండేవన్న విషయాలపై అవగాహన తెచ్చేలా తాజాగా పవన్ కల్యాణ్ తాను చేసిన పనుల్ని చెప్పుకొచ్చి సంచలనంగా మారారు. తాను ఇంటర్ ఫెయిల్ అయినప్పుడు విపరీతమైన నిరాశ.. నిస్పృహలకు లోనైనట్లు చెప్పారు.

అన్నయ్య చిరంజీవి లైసెన్డ్స్ పిస్టోల్ తో కాల్చుకొని చనిపోవాలని తాను అనుకున్నట్లు చెప్పారు. కానీ.. తన అన్నయ్య చెప్పిన మాటలు తన మీద ప్రభావాన్ని చూపించాయన్నారు. తనలో విశ్వాసం పెరిగేలా అన్నయ్య చెప్పిన మాటలతో ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనను విరమించుకున్నట్లు చెప్పారు. ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ల ఇళ్లల్లో చిరంజీవి లాంటి అన్నయ్య ఉంటే.. ఎలాంటి ఆత్మహత్యలు చేసుకోరన్నారు.

తన జీవితంలో మూడుసార్లు తప్పుడు మార్గాల్లోకి వెళ్లకుండా అన్నయ్య తనను కాపాడారన్నారు. ఇంటర్ తప్పినప్పుడు.. దేశాన్ని ఎవరైనా ఏమైనా అన్నంతనే పట్టలేనంత కోపం వచ్చే రోజులతో పాటు.. 22 ఏళ్ల వయసులో ఆశ్రమంలో చేరాలనుకున్న వేళలో అన్నయ్య తనకు ఇచ్చిన సలహాతోనే తాను తప్పుడు మార్గంలోకి వెళ్లకుండా ఆగినట్లు చెప్పారు. పవన్ తాజా వ్యాఖ్యలు ఆసక్తికరంగానే కాదు.. సంచలనంగా మారాయి.
Please Read Disclaimer