జార్జ్ రెడ్డిని ఓన్ చేసుకుంటున్న పవన్ ఫ్యాన్స్

0

ఉస్మానియా యూనివర్శిటీ స్టూడెంట్ లీడర్ అయిన జార్జ్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన జార్జ్ రెడ్డి సినిమా ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యే వరకు చాలా సైలెన్స్ ను మెయింటెన్ చేస్తూ వచ్చారు. ఎప్పుడైతే షూటింగ్ పూర్తి అయ్యిందో అప్పటి నుండి సినిమా పబ్లిసిటీ మొదలు పట్టారు. స్టూడెంట్ లీడర్ అయిన జార్జ్ రెడ్డి గురించి ప్రచారం చేయడం ద్వారా ఈ సినిమాకు భారీగా పబ్లిసిటీ దక్కింది.

ఇక పవన్ కళ్యాణ్ కు జార్జ్ రెడ్డికి పోలిక పెడుతూ చిత్ర యూనిట్ సభ్యులు చేసిన ప్రచారం వర్కౌట్ అయ్యింది. జార్జ్ రెడ్డి సినిమాలోని ఒక పాటను పవన్ కళ్యాణ్ కు అంకితం ఇవ్వడం వల్ల కూడా పవన్ ఫ్యాన్స్ లో ఈ సినిమా క్రేజ్ దక్కించుకున్నట్లయ్యింది. ఇక జార్జ్ రెడ్డి సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. నేడు జరగాల్సిన ప్రీ రిలీజ్ వేడుకకు పవన్ గెస్ట్ గా రాబోతున్నాడని కూడా ప్రచారం జరిగింది.

ప్రీ రిలీజ్ వేడుకకు ప్రభుత్వం నుండి అనుమతి రాలేదన్న ప్రచారం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జరిగింది. కాని ప్రీ రిలీజ్ వేడుక గురించి చిత్ర యూనిట్ సభ్యుల నుండి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం కారణంగా పెద్ద ఎత్తున పవన్ ఫ్యాన్స్ ఈ చిత్రాన్ని ఓన్ చేసుకున్నారు. ఈ సినిమాపై ఫ్యాన్స్ లో చాలా ఆసక్తి కనిపిస్తుంది. కనుక జార్జ్ రెడ్డికి మంచి ఓపెనింగ్స్ రావడం కన్ఫర్మ్ అంటున్నారు.
Please Read Disclaimer