త్రివిక్రమ్ పై గుర్రుగా ఉన్న పవన్ ఫ్యాన్స్…?

0

టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరి కాంబోలో ఇప్పటి వరకు మూడు సినిమాలు వచ్చాయి. వాటిలో ‘జల్సా’ ‘అత్తారింటికి దారేది’ సినిమాలు మంచి విజయాన్ని నమోదు చేసుకుని రికార్డులను తిరగరాసాయి. ఇక పవర్ స్టార్ పవన్ కెరీర్లో మైలురాయి సిల్వర్ జూబ్లీ చిత్రంగా.. పవన్ – త్రివిక్రమ్ కలయికలో వచ్చిన హ్యాట్రిక్ మూవీ ‘అజ్ఞాతవాసి’. ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘అజ్ఞాతవాసి’ కారణంగా.. సినిమాకి పని చేసిన వారందరూ కొన్ని నెలల పాటు అజ్ఞాతంలోకి వెళ్లే రేంజ్ లో డిజాస్టర్ అయింది. ముఖ్యంగా డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కారణంగానే ఈ సినిమా ఘోర పరాజయాన్ని చవి చూసిందని అందరూ ఆరోపించారు. అందులోనూ ఈ సినిమా ఫ్రెంచ్ మూవీ ‘లార్గో విచ్’కి కాపీ అంటూ న్యూస్ రావడంతో పవర్ స్టార్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.నిజానికి త్రివిక్రమ్ కెరీర్ లో ప్లాప్ సినిమాలు చాలా ఉన్నప్పటికీ ‘అజ్ఞాతవాసి’ రేంజ్ లో దారుణమైన సినిమా లేదని కామెంట్స్ వినిపించాయి. ఇక పవన్ కెరీర్లో మైల్ స్టోన్ గా నిలవాల్సిన మూవీని మర్చిపోవాల్సిన సినిమాగా మలిచాడని ఫ్యాన్స్ డిజప్పాయింట్ అయ్యారు. అయితే త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ తో మరో సినిమా తీసి తన మీద పడిన నెగిటివ్ ముద్రని తొలగించాలని వారు కోరుకున్నారు. సినిమాలను పక్కన పెడితే నిజ జీవితంలో కూడా పవన్ – త్రివిక్రమ్ స్నేహితులుగా కొనసాగుతుండటంతో వీరి కాంబోలో మరో సినిమా పట్టాలెక్కుతుందని అందరూ ఆశించారు. అయితే త్రివిక్రమ్ ఇప్పట్లో పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే ఆలోచనలో లేదట.

‘అల వైకుంఠపురంలో’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న త్రివిక్రమ్ వెంటనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ప్రాజెక్ట్ అనౌన్స్ చేసాడు. అంతేకాకుండా ఈ లాక్ డౌన్ సమయంలో మరో రెండు కథలు సిద్ధం చేశాడట త్రివిక్రమ్. అయితే వాటిలో ఒక్కటి కూడా పవన్ తో మూవీ కోసం కాదట. దీనికి తోడు త్రివిక్రమ్ భవిష్యత్తులో అయినా పవన్ తో సినిమా ఉంటుందని క్లారిటీ ఇవ్వడం లేదట. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ త్రివిక్రమ్ తీరుపై అసహనంగా ఉన్నారట. పవన్ కళ్యాణ్ విషయంలో త్రివిక్రమ్ శైలి అభిమానులకు ఏ మాత్రం నచ్చడం లేదట. పవన్ ని త్రివిక్రమ్ మరీ ఇంత లైట్ తీసుకుంటే ఎలా అంటూ సోషల్ మీడియా ద్వారా వారి ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ‘అజ్ఞాతవాసి’ లాంటి డిజాస్టర్ ఇచ్చినప్పుడు పవన్ కోసం మరో హిట్ సినిమా చేయాల్సిన బాధ్యత లేదా అని ప్రశ్నిస్తున్నారు. మరి ఇప్పటికైనా త్రివిక్రమ్ తన స్నేహితుడు పవన్ తో సినిమా ఉంటుందని ఒక మాట చెప్తే పవర్ స్టార్ ఫ్యాన్స్ శాంతిస్తారేమో చూడాలి.
Please Read Disclaimer