హైటెన్షన్ లో పవన్ రీఎంట్రీ సాధ్యమా?

0

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీఎంట్రీ ప్రస్తుతం హాట్ టాపిక్. ఆయనొస్తారు.. పింక్ రీమేక్ లో నటిస్తారు అంటూ అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. అయితే పవన్ పరిస్థితి చూస్తుంటే అలా కనిపించడం లేదన్న గుసగుసలు తాజాగా వేడెక్కిస్తున్నాయి. ఇదంతా అమరావతి తరలింపు పెట్టిన చిచ్చు.

ఓవైపు రాజధాని తరలింపు వ్యవహారం అంతకంతకు ఏపీ పొలిటికల్ కారిడార్ లో హీటెక్కిస్తోంది. అమరావతి నుంచి విశాఖకు రాజధానిని తరలించేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఏర్పాట్లు చేస్తుంటే దానిని వ్యతిరేకిస్తూ.. ఉద్యమాల పేరుతో పవన్ పూర్తిగా బిజీ అయిపోయారు. ఇప్పుడున్న సన్నివేశంలో పవన్ కి తీరిక చిక్కే సన్నివేశం కనిపించడం లేదు. పైగా టెన్షన్లతో కూడుకున్న హైఎలెర్ట్ సన్నివేశం కనిపిస్తోంది. అలాంటప్పుడు ఈ రీమేక్ లో పవన్ నటించే సీన్ ఉంటుందా? అంటూ అభిమానుల్లో సందేహం నెలకొంది.

ఓవైపు ఈనెల 20 నుంచి పింక్ రీమేక్ రెగ్యులర్ షూటింగుకి దిల్ రాజు – వేణు శ్రీరామ్ బృందం ఏర్పాట్లలో ఉందన్న ప్రచారం సాగుతోంది. పవన్ కూడా షూటింగులో పాల్గొంటారని చెబుతున్నారు. అయితే రాజధాని ఉద్యమం ఇప్పట్లో ఆగేట్టు లేదు. ఇది నిరంతరాయమైన పోరాటంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో జనసేనాని సడెన్ గా యూటర్న్ తీసుకుని ప్రశాంతంగా సినిమాల్లో నటించగలరా? అన్నది సందిగ్ధంగా మారింది. పవన్ కేటాయించింది చాలా తక్కువ కాల్షీట్లే అయినా పొలిటికల్ టెన్షన్స్ తో నటించడం అంత సులువేమీ కాదన్న విశ్లేషణా సాగుతోంది. మరోవైపు ఈ రీమేక్ లో పవన్ నటిస్తున్నారు అన్నది ఇంతవరకూ నిర్మాతలు పక్కా కాన్ఫిడెంట్ గా ప్రకటించకపోవడంపైనా రకరకాల సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరి దీనిపై పీఎస్.పీకే వర్గాలు ఏం చెబుతాయో చూడాలి.
Please Read Disclaimer