పవన్ కళ్యాణ్ కు జోడీగా తెలుగమ్మాయి…?

0

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవలే సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. ఈ సినిమాలో హై ఓల్టేజ్ పోలీస్ ఆఫీసర్ రోల్ తో పవన్ కళ్యాణ్ రాబోతున్నాడని అనౌన్స్మెంట్ పోస్టర్ తోనే వెల్లడించారు. దీంతో ఇది మలయాళ సూపర్ హిట్ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కనుందని స్పష్టం అయింది. మలయాళంలో బిజూ మీనన్ పోషించిన సిన్సియర్ పోలీసాఫీసర్ పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించనున్నాడు. ఇక ఈ సినిమాలో హీరో పాత్రకు కూడా ప్రాధాన్యత ఉంటుంది. దీంతో ఆ పాత్రలో పవన్ కళ్యాణ్ కి జోడీగా ఎవరిని తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

అయితే పవన్ కళ్యాణ్ భార్య పాత్రలో తెలుగు హీరోయిన్ అంజలి ని తీసుకునే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. మలయాళ వర్షన్ లో ఆ పాత్రకు ఇంపార్టన్స్ ఉన్నప్పటికీ నిడివి మాత్రం తక్కువగా ఉంటుంది. కానీ తెలుగులో మాత్రం ఆ పాత్ర నిడివి పెంచబోతున్నారని సమాచారం. అంజలి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కంబ్యాక్ మూవీ ‘వకీల్ సాబ్’ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో పవన్ కల్యాణ్ జోడీగా సాయిపల్లవి నటిస్తుందని సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. కాగా తెలుగు ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ చిత్రానికి అరకు నేపథ్యాన్ని ఎంచుకున్నారని తెలుస్తోంది. ఆంధ్రాలో మద్యపానం నిషేధం బ్యాక్ డ్రాప్ తో ఈ స్టోరీ ప్రారంభం అవుతుందని సమాచారం. ఈ చిత్రానికి థమన్ సంగీత దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. ప్రసాద్ మూరెళ్ళ సినిమాటోగ్రఫీ అందించనున్నాడు. ‘వకీల్ సాబ్’ పూర్తయిన వెంటనే ఈ ఈ సినిమాను స్టార్ట్ చేయనున్నారని తెలుస్తోంది.