లాయర్ సాబ్ లీకులపై ఫుల్ సీరియస్

0

ఆన్ లైన్ పైరసీ.. ఆన్ లొకేషన్ నుంచి లీకుల బెడద నిరంతరం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అగ్ర హీరోలు నటించే భారీ క్రేజు ఉన్న సినిమాలకు సంబంధించి ఫోటోలు.. వీడియోలు లీకవ్వడం దర్శకనిర్మాతల్ని తీవ్ర కలవరపాటుకు గురి చేస్తోంది. సినిమాలో ఉత్కంఠను పెంచే కీలక సన్నివేశాలకు సంబంధించిన లీకుల వల్ల ఊహించని డ్యామేజీని ఎదుర్కోవాల్సి వస్తోందన్న ఆవేదనా వ్యక్తమవుతోంది.

2020 మోస్ట్ అవైటెడ్ మూవీస్ ఆర్.ఆర్.ఆర్ – కేజీఎఫ్ 2 లీకుల గురించి మేకర్స్ లో ఇప్పటికే ఆందోళన వ్యక్తమవుతోంది. ఆ క్రమంలోనే ఆన్ లొకేషన్ స్ట్రిక్ట్ రూల్స్ ని పాస్ చేశారు. స్పాట్ లో మొబైల్స్ సహా ఇతరత్రా సామాగ్రిని చిత్రబృందాలు నిషేధించాయి. అయినా ఏదో ఒక మూల నుంచి లీకులు మాత్రం తప్పడం లేదు. ఆర్.ఆర్.ఆర్ చిత్రంలో గెటప్పులకు సంబంధించిన కొన్ని ఫోటోలు.. ఓ వీడియో ఇటీవల బయటకు లీకవ్వడంతో రాజమౌళి అండ్ టీమ్ సీరియస్ అయిన సంగతి తెలిసిందే. కేజీఎఫ్ చిత్రబృందం లీకులకు కారకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంది.

ఇప్పుడు అదే తరహాలో జనసేనాని.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీఎంట్రీ మూవీ లాయర్ సాబ్ కి లీకుల బెడద తప్పడం లేదు. ఇంతకుముందు పవన్ ఇంట్రడక్షన్ సీన్ కి సంబంధించిన ఓ వీడియో లీకవ్వడంతో నిర్మాత దిల్ రాజు లొకేషన్ లో టీమ్ పై సీరియస్ అయ్యారని తెలిసింది. ఆ క్రమంలోనే ఆన్ లొకేషన్ మొబైల్స్ కానీ కెమెరాలు కానీ ఎలో చేయకుండా స్ట్రిక్టుగా రూల్స్ ని పాస్ చేశారట. లీకులకు కారకులెవరు అన్నదానిపైనా ఆరాలు తీసారని తెలుస్తోంది. ఇకపై ఇలాంటి సన్నివేశం మరోసారి రిపీటైతే యాక్షన్ సీరియస్ గా ఉంటుందని వార్నింగ్ ఇచ్చారట. ఇప్పటికే ఈ సినిమాని సమ్మర్ కానుకగా మే 15న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అంటే చాలా తక్కువ సమయంలోనే సినిమాని పూర్తి చేసి రిలీజ్ చేయాలన్న పట్టుదల యూనిట్ వర్గాల్లో కనిపిస్తోంది. అందుకు తగ్గట్టే పవన్ షెడ్యూల్స్ ని డిజైన్ చేశారు. ఆ క్రమంలోనే లీకులు బెడద నుంచి కాపాడుకునేందుకు ఇప్పుడు సీరియస్ గా వర్క్ చేస్తున్నారట.
Please Read Disclaimer