భద్రాచలం శ్రీ సీతారాముల కళ్యాణం - LIVE

#PSPK 27 ఇదేం బందిపోటు వేషం?

0

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ సర్వత్రా హాట్ టాపిక్. ఆయన రాక కోసం ఫ్యాన్స్ ఎంతో ఎగ్జయిటింగ్ గా వెయిట్ చేస్తున్నారు. ఒకదాని వెంట ఒకటిగా మూడిటికి ఓకే చెప్పాడు. తొలిగా పింక్ రీమేక్ `వకీల్ సాబ్` స్పీడ్ గా పూర్తవుతోంది. ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ వచ్చినా దాంతో సంతృప్తిగా అయితే లేరు. పైపెచ్చు అందరూ అసంతృప్తిగా ఉన్నారు. ఆ తర్వాత ఆయనకు సంబంధించి ఎలాంటి కొత్త లుక్ లు రాలేదు. దీంతో పవన్ పూర్తిగా కనిపించే పోస్టర్ ఏదైనా వస్తుందా? అని ఎంతో ఆతృతతో ఫ్యాన్స్ ఉన్నారు. తాజాగా ఆయనకు సంబంధించిన ఓ కొత్త ఫోటో లీక్ అయ్యింది. `వకీల్ సాబ్`లోని లుక్ అంటూ సోషల్ మీడియాలో ఓ ప్రచారం వైరల్ అవుతోంది.

రీఎంట్రీ ఇస్తూ పవన్ నటిస్తున్న `వకీల్ సాబ్` చిత్రీకరణ చివరి దశలో ఉంది. ఇది బాలీవుడ్ `పింక్`కి రీమేక్ గా రూపొందుతున్న విషయం విదితమే. `ఎంసీఏ` ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్నారు. దీంతోపాటు క్రిష్ దర్శకత్వంలో ఓ పీరియాడికల్ డ్రామాలో నటిస్తున్నారు. ఇది కూడా శరవేగంగా.. సైలెంట్ గా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇందులో పవన్ రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపిస్తారట. తెలంగాణ చరిత్రలో మరుగున పడిన ఓ వీరుడి కథ ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ఏ.ఎం.రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది శరవేగంగా చిత్రీకరణ పూర్తవుతోంది.

తాజాగా పవన్ కళ్యాణ్ లుక్ ఒకటి లీక్ అయ్యింది. `వకీల్ సాబ్` కి సంబంధించిన లుక్ అని.. మరోవైపు క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కే చిత్రంలోని లుక్ అంటూ మరికొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. చాలా వరకు ఇది క్రిష్ రూపొందించే చిత్రంలోని తను నటించే రాబిన్ హుడ్ లుక్ అనేది బలంగా వినిపిస్తుంది. ఇదే నిజమైతే రాబిన్ హుడ్ గెటప్ ఇలా ఉందేమిటి? అన్న డౌట్ వినిపిస్తోంది. గద్దల్ని కొట్టి పేదలకు పెట్టే ఓ బందిపోటు ఇంత సింపుల్ గానా? పొడవాటి గిరజాల జుట్టు.. గుబురు గెడ్డంతో కాస్త గాంభీరంగా కనిపించాల్సి ఉంటుంది. `రుద్రమదేవి`లో బందిపోటు (గోనగన్నా రెడ్డి) లుక్ .. `సైరా నరసింహారెడ్డి`లో చిరంజీవి బందిపోటు లుక్ లో గంభీరంగా కనిపించారు. కానీ తాజా లుక్ లో పవన్ క్లీన్ షేవ్ చేసుకుని.. నుదుటికి పొడవాటి బొట్టు పెట్టి కోపంగా చూస్తున్నారు. దీంతో ఈ లుక్ పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అలాగే పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరి ఇందులో ఏది నిజం అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. అయితే తాజా లుక్ మాత్రం సోషల్ మీడియాలో ఇటూ ఇటూ హల్చల్ చేస్తోంది. ఫోటో ఏ సినిమాలోదైనా.. పవన్ కనిపించాడు అది చాలా మాకు అని ఆయన ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.




Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-