కొత్త లుక్ లో సర్ ప్రైజ్ ఇచ్చిన జనసేనాని

0

ఎన్నికలకు కొంతకాలం ముందు నుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన స్టైలిష్ లుక్స్ విషయం పట్టించుకోకుండా ఉన్న సంగతి తెలిసిందే. సినిమా హీరోల స్టైల్ కు భిన్నంగా గడ్డం.. జుట్టు పెంచి ఒక తత్వవేత్తలాగా కనిపించేవాడు. ఎలక్షన్స్ పూర్తయిన తర్వాత పవన్ మళ్ళీ క్లీన్ షేవ్ లుక్ లో కనిపిస్తారని అనుకున్నారు కానీ అలా జరగలేదు. ఎన్నికల ఫలితాలు వెల్లడయిన తర్వాత అయినా పవన్ గెటప్ మారుతుందని కొంతమంది అనుకున్నారు.. కానీ అలా కూడా జరగలేదు. అయితే తాజాగా పవన్ తన లుక్ ను మార్చారు.

ఈమధ్య పవన్ ఒక స్కూల్ లో చదువుతున్న స్టూడెంట్ ను కలిసిన సందర్భంగా తీసిన ఫోటో ప్రస్తుతం ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతోంది. ఈ ఫోటోలో పవన్ గెటప్ కొత్తగా ఉంది. దాదాపు పూర్తిగా ట్రిమ్మింగ్ చేసిన గడ్డం.. కొత్త హెయిర్ కట్ తో పవన్ కనిపిస్తున్నారు. చెక్స్ షర్టు.. జీన్స్ లో పవన్ ఒక ఫిలిం స్టార్ తరహాలోనే కనిపిస్తున్నారు. పవన్ ఇప్పటికే పలుమార్లు సినిమాలకు తానూ దూరమని ప్రకటించినప్పటికీ త్వరలో పవన్ రీ-ఎంట్రీ ఇస్తారనే వార్తలు మాత్రం ఆగడం లేదు.

నిజంగా పవన్ మళ్ళీ సినిమా చేస్తారో లేదో ఇంకా తెలియదు కానీ పవన్ న్యూ లుక్ ను చూసిన జనసేన కార్యకర్తలు.. పవన్ అభిమానులు మాత్రం ఫుల్లుగా ఖుషీ అవుతున్నారు. ఎన్ని చెప్పినా టాలీవుడ్ కు పవన్ ఎప్పటికీ పవర్ స్టారే కదా. ఈ సమయంలో కనుక పవన్ కొత్త సినిమా డీటెయిల్స్ కూడా వచ్చాయంటే అభిమానుల సంతోషానికి అవధులే ఉండవు.. చూద్దాం ఏం జరుగుతుందో..!