వాల్ పోస్టర్లతోనే థియేటర్లకు రప్పించగలిగే ఘనులు!

0

ఒక స్టార్ హీరోతో సినిమా చేయడానికి ఒక సాధారణ హీరోతో చేయడానికి తేడా ఏంటి అంటే సినిమాకు జరిగే బిజినెస్సే. మన టాలీవుడ్ లో పెద్ద స్టార్ హీరోతో సినిమా చేస్తే ఆ సినిమాకు అతి సులువుగా 100 కోట్ల స్థాయిలో ప్రీరిలీజ్ బిజినెస్ జరుగుతుంది. ఈ స్టార్ హీరోల సినిమాలకు ఓపెనింగ్స్ కూడా అదే స్థాయిలో ఉంటాయి. అందుకే ఇండస్ట్రీ అంతా స్టార్ హీరోల చుట్టూనే తిరుగుతూ ఉంటుంది.

అయితే ఈ స్టార్ హీరోలలో కూడా కొందరికి మాత్రం అసలు ప్రచారం అవసరం లేకుండానే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలిగే సత్తా ఉంది. జస్ట్ వాల్ పోస్టర్స్ వేస్తే చాలు.. మరే రకమైన పబ్లిసిటీ ఈ హీరోల సినిమాలకు నిజానికి అవసరం లేదు. ఇలాంటి సత్తా ఉన్న వారు ఎవరనే విషయంపై రీసెంట్ గా ఒక సర్వే జరిగింది. ఈ లిస్టులో సీనియర్ హీరోలలో చిరంజీవి.. బాలకృష్ణ ఉండగా ఈ తరం హీరోలలో మహేష్ బాబు.. పవన్ కళ్యాణ్.. ఎన్టీఆర్.. అల్లు అర్జున్.. రామ్ చరణ్.. ప్రభాస్ లు ఉన్నారు. వీరి సినిమాలకు మాత్రం ఏమాత్రం ప్రచారం లేకుండా సినిమాను డైరెక్ట్ గా విడుదల చేసినా ఫ్యాన్స్ వచ్చి సినిమా చూసేస్తారట. మిగతా హీరోలకు కూడా ఫ్యాన్స్ ఉంటారు కదా.. వారి సంగతి ఏంటి అని అడిగితే.. ఫ్యాన్స్ చూస్తారు కానీ ఆ కలెక్షన్లు నామమాత్రంగా కూడా ఉండవని అంటున్నారు.

ఇదొక్కటే కాదు.. ఈ హీరోల సినిమాలు జస్ట్ ‘యావరేజ్’ టాక్ తెచ్చుకుంటే చాలు.. సోమవారం బాక్స్ ఆఫీసు టెస్ట్ ను సులువుగా పాస్ కాగలవని.. అదే ఇతర హీరోల సినిమాలకు యావరేజ్ అనే టాక్ వస్తే మొదటి సోమవారమే సినిమాలు టపా కట్టేస్తాయని అంటున్నారు. అందుకే స్టార్ హీరోలు స్టార్ హీరోలే.. వారి రేంజ్ వేరే అనుకోవాలి.
Please Read Disclaimer