PSPK 27 టైటిల్ ఇదేనా?

0

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన 27వ చిత్రాన్ని క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. లాయర్ సాబ్ లో నటిస్తూనే క్రిష్ చిత్రానికి కాల్షీట్లు సర్దుబాటు చేసాడు. లాయర సాబ్ తొలి షెడ్యూల్ పూర్తిఅవ్వడంతో క్రిష్ సినిమా షూటింగ్ లో పవన్ పాల్గొంటున్నాడు. అయితే ఈ ఐదు రోజులు రాజకీయ సమావేశాలకు సమయం కేటాయించాడు. తిరిగి మళ్లీ యథావిథిగా 16వ తేదీని నుంచి షూటింగ్ లో పాల్గొంటాడు. ఈ నేపథ్యంలో క్రిష్ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ టైటిల్ ఒకటి వినిపిస్తుంది.

ఇది పీరియాడిక్ స్టోరీ అన్న సంగతి తెలిసిందే. ఇందులో పవన్ రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపించనన్నాడు. దీంతో తొలిసారి పవన్ ఛాలెంజింగ్ పాత్రలో నటిస్తున్నాడు అన్న ప్రచారం అంతే వేడెక్కిస్తుంది. అయితే తాజాగా రివీల్ అయిన టైటిల్ రొటీన్ సినిమాలకు భిన్నంగా ఉంటుంది. పవన్ గత సినిమాలకు ఏ మాత్రం సంబంధం లేకుండా విఫరెంట్ టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. ఆ టైటిల్ `విరూపాక్షి` అట. ఇందులో పవన్ పాత్ర పేరు వీరు. మరి టైటిల్ జస్ట్ ఫికేషన్ ఏంటో సినిమా చూస్తే గాని తెలియదు.

క్రిష్ కాన్సెప్ట్ బేస్ట్ స్ర్కిప్ట్ లతో సినిమాలు చేస్తాడు. అందులో పాత్రలు ఎలా ఉన్నా! తన దృష్టిలో కేవలం స్ర్కిప్ట్ మాత్రమే హీరో. పవన్ స్ర్కిప్ట్ కూడా అలాంటిందే. పవన్ హీరోయిజం సినిమాలో పెద్దగా కనిపించదు. కేవలం స్టోరీని మాత్రమే పవన్ తన ఇమేజ్ తో నడిపిస్తాడని సోర్సెస్ చెబుతున్నాయి. స్ర్కిప్ట్ ఆధారంగానే విరూపాక్షి అనే టైటిల్ కూడా క్రిష్ ఇష్ట ప్రకారం నిర్ణయించడం జరిగిందిట. పవన్ కూడా స్ర్కిప్ట్ నచ్చడంతో అన్ని రైట్స్ క్రిష్ కే ఇచ్చాసాడని..ఆయన నిర్ణయాల ప్రకారమే సెట్స్ లో నడుచుకుంటున్నాడన్న విషయం వెలుగులోకి వచ్చింది.




Please Read Disclaimer