ఇంట్లో నుండి డబ్బింగ్ చెప్తా: పవన్ కళ్యాణ్

0

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. వకీల్ సాబ్ సినిమాతో మళ్లీ సినీ ఇండస్ట్రీలో రీఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు మరో చిన్న షెడ్యూల్ మిగిలి ఉందట. త్వరలోనే అది కూడా పూర్తిచేద్దాం అనుకునేలోపు కరోనా మహమ్మారి ప్రపంచాన్ని చుట్టేసింది. అందుకే షూటింగ్స్ ఆపేసి ఎక్కడివారక్కడే ఇళ్లకు అంకితమయ్యారు. పవర్ స్టార్ కూడా వకీల్ సాబ్ షూటింగులో ఉండగానే మరో కొన్ని ప్రాజెక్ట్ లను లైన్లో పెట్టారట.

ఇదిలా ఉండగా కరోనా భయంతో షూటింగ్స్ నిలిచిపోవడం వలన వకీల్ సాబ్ టీం అంతా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించిందట. ఇక పవర్ స్టార్ కూడా ఈ సినిమా డబ్బింగ్ పనులను తన ఇంటి నుండి పూర్తిచేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ అవుతోంది. కరోనా బారినుండి తప్పించుకోవాలంటే ఎవరి ఇళ్లలో వాళ్లు జాగ్రత్తగా ఉండి పనులు పూర్తిచేసుకోవాలని పవన్ కళ్యాణ్ ఇండైరెక్ట్ గా సందేశాన్ని అందిస్తున్నాడని అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. చూడాలి పవర్ స్టార్ స్పూర్తితో అన్ని సినిమాల పనులు ప్రారంభం అవుతాయేమో..!
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-