ఇక పై నా సినిమాలలో డాన్సులు.. రొమాన్స్ ఉండవు!

0

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ షూటింగులో ప్రస్తుతం బిజీగా ఉన్నారు. ఆ సినిమా తర్వాత ఆయన తదుపరి చిత్రం డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి షూటింగ్ పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమా హిందీ పింక్ నుండి రీమేక్ చేస్తుండగా ఆ సినిమాకు వేణుశ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక రాజకీయాల తర్వాత పవర్ స్టార్ రీఎంట్రీ ఇవ్వబోతున్న సినిమా కాబట్టి ప్రేక్షకుల అంచనాలు తారాస్థాయిలో నెలకొన్నాయి. అలాంటిది తదుపరి చిత్రం విరూపాక్ష గురించి చిన్న వార్త తెలిసినా అభిమానులకు పండగే. పవర్ స్టార్ నటించనున్న 27వ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ తెరకెక్కిస్తున్నాడు.

కానీ అభిమానులు నిరాశ చెందే ఓ వార్త ప్రస్తుతం సినీ వర్గాలలో హల్చల్ చేస్తోంది. అదేంటంటే.. పవన్ కళ్యాణ్ నటించబోయే తదుపరి సినిమాలలో డాన్సులు చేయరట.. డాన్స్ చేసే పాటలు కూడా ఉండవని పవన్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఎందుకంటే ఆయన రాజకీయ సేవా కార్యక్రమాలలో ఉంటూ ఇలాంటి పాటలు డాన్సులు.. రొమాన్స్ కరెక్ట్ కాదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అందుకే త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న విరూపాక్ష సినిమాలో కేవలం రెండు పాటలే ఉన్నాయట. అవి కూడా సందర్భానుసారంగా రానున్నాయని అంటున్నారు. ఇక ఈ సినిమాను ఏయం రత్నం నిర్మిస్తుండగా.. ఈ సినిమా మొగలాయిల కాలం నాటి కథతో తెరకెక్కనుంది.

ఈ చారిత్రాత్మక కథను క్రిష్ కూడా పవన్ ఇమేజ్ కి సరిపోయేలా మెరుగులు దిద్దారట. చారిత్రాత్మక చిత్రం కావడంతో రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్లను ఆ కాలం నాటి నేటివిటీని ప్రతిబింబించేలా రూపొందిస్తున్నట్లు చిత్ర వర్గాలలో టాక్. ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే గొప్ప చిత్రంగా నిలుస్తుందని అభిమానులు ఆశాభావము వ్యక్తం చేస్తున్నారు. మరి డైరెక్టర్ క్రిష్ చాలా కాలం గ్యాప్ తీసుకొని పవన్ కళ్యాణ్ సినిమాపై పనిచేస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ఆగష్టులో ప్రారంభం కానుందని సమాచారం. ఇక ఈ సినిమాను తక్కువ టైంలో పూర్తి చేయడానికి క్రిష్ సెట్ డిజైన్ చేసారట. ఈ చారిత్రక సినిమాకి ఎంఎం కీరవాణి స్వరాలు సమకూర్చుతున్నారు.
Please Read Disclaimer