అఫిషియల్.. మెగా వేడుకలో పవన్

0

మెగాస్టార్ చిరంజీవి రేపు పుట్టిన రోజు జరుపుకోబోతున్న విషయం తెల్సిందే. ప్రతి ఏడాది మెగాస్టార్ బర్త్ డే వేడుకలను ఫ్యాన్స్ భారీ ఎత్తున నిర్వహిస్తూ ఉంటారు. రక్తదాన శిభిరాలు ఏర్పాటు చేయడంతో పాటు ఎక్కడికి అక్కడ ఏవో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇక ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా శిల్ప కళావేదికలో మెగా ఫ్యాన్స్ చిరంజీవి బర్త్ డే వేడుకలు నిర్వహించబోతున్నారు. అఖిల భారత చిరంజీవి ఫ్యాన్స్ అసోషియేషన్ అధ్యక్షుడు స్వామి నాయుడు ఇప్పటికే చిరు పుట్టిన రోజుకు సంబంధించిన వేడుకల ఏర్పాట్లు పూర్తి చేయించాడు.

ఈసారి చిరంజీవి పుట్టిన రోజు వేడుక మీట్ కు ప్రత్యేక అతిథిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరు కాబోతున్నాడు. గత మూడు నాలుగు రోజులుగా ఈ విషయమై మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. పవన్ హాజరు కాబోతున్నాడనే ప్రచారం జరిగింది. కాని ఎక్కడ చిన్న అనుమానం అయితే కొందరిలో కలిగింది. కాని తాజాగా పవన్ కళ్యాణ్ ను చిరంజీవి ఫ్యాన్స్ అసోషియేషన్ అధ్యక్షుడు స్వామి నాయుడు కలిసి చిరంజీవి బర్త్ డే వేడుకలకు హాజరు అవ్వాల్సిందిగా కోరడం జరిగింది.

నేడు సాయంత్రం శిల్ప కళా వేదికలో జరుగబోతున్న ఈ వేడుకల్లో పవన్ కళ్యాణ్ తో పాటు మెగా బ్రదర్ నాగబాబు కూడా పాల్గొనబోతున్నాడు. పవన్ కళ్యాణ్ హాజరు కాబోతున్న నేపథ్యంలో భారీ ఎత్తున భద్రత ఏర్పాట్లు చేయిస్తున్నారు. ఇప్పటికే పాస్ ల డిస్ట్రిబ్యూషన్ పూర్తయ్యింది. పవన్ కళ్యాణ్ హాజరు కాబోతున్నాడు కనుక మెగా ఫ్యాన్స్ పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశం ఉంది కనుక అందుకు తగ్గట్లుగా చర్యలు తీసుకుంటున్నారు. నేడు సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభం కాబోతున్న ఈ వేడుకకు పవన్ మరియు నాగబాబు కలిసి వెళ్లే అవకాశం ఉంది.
Please Read Disclaimer