ఈ మూడుతో ఆపే మూడ్ లో లేని పవర్ స్టార్

0

పవన్ కళ్యాణ్ రాజకీయ పయనం ఎలాగైనా ఉండొచ్చు.. ఆ పయనంపై ఎంతోమందికి తేలిక అభిప్రాయం కూడా ఉండొచ్చు కానీ సిల్వర్ స్క్రీన్ విషయానికి వస్తే మాత్రం పవర్ స్టార్ రేంజే వేరు. పవన్ కు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ అందరికీ తెలిసిందే. అందుకే పవన్ రీఎంట్రీ గత కొంతకాలంగా ఒక హాట్ టాపిక్ అయింది. పవన్ ‘పింక్’ రీమేక్ చాలా రోజుల నుండి వార్తల్లోనే ఉంది. ఇంతలోనే క్రిష్ దర్శకత్వంలోనే మరో సినిమా కూడా లాంచ్ అయింది. రెండు సినిమాలు అనుకునేలోపు ముచ్చటగా మూడవ చిత్రం హరీష్ శంకర్ – మైత్రీ మూవీ మేకర్స్ తో ఫిక్స్ అయింది. ఈ సినిమా ప్రకటనలకు ప్రస్తుతానికి ఫుల్ స్టాప్ పడుతుందా అని ప్రశ్న వేస్తే మూడుతో ఆపే మూడ్ లో పవర్ స్టార్ అస్సలు లేరట.

‘పింక్’ రీమేక్ పూర్తి కాగానే క్రిష్ సినిమా.. హరీష్ శంకర్ మూవీకి పవన్ డేట్స్ ఇస్తారట. ఇకపై పవన్ నాన్ స్టాప్ గా పనిచేస్తారని సినిమాలకు ఎక్కువ సమయం కేటాయిస్తారని సమాచారం. ఈ మూడు సినిమాలతో పాటుగా ఇంకా పలు ప్రాజెక్టులు లైన్ లో ఉన్నాయట. ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ రామ్ తాళ్లూరికి ఒక సినిమా చేస్తానని.. హారిక హాసిని క్రియేషన్స్ వారికి ఒక సినిమా చేస్తానని మాటిచ్చారట. నిర్మాతల సంగతి ఇలా ఉంటే పలువురు దర్శకులు పవన్ కోసం స్క్రిప్టులు రెడీ చేస్తున్నారట. డాలీ.. పూరి జగన్నాధ్ లు ఇప్పటికే పవన్ కు ఇమేజి కి తగ్గట్టుగా బలమైన కథలను తయారు చేస్తున్నారట. వీరే కాకుండా కొందరు యువ దర్శకులు కూడా పవన్ ను మెప్పించేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారట.

ఈ ఏడాది.. వచ్చే ఏడాదిలో పవన్ షూటింగులతో బిజీబిజీగా గడపబోతున్నారని కనీసం ఐదారు సినిమాలు పూర్తి చేయాలనే ప్లాన్ లో ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. త్వరలోనే మిగతా ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలు కూడా వెల్లడవుతాయని అంటున్నారు. పవర్ స్టార్ ఫ్యాన్స్ కు ఇది పండగలాంటి వార్తే అని చెప్పవచ్చు.
Please Read Disclaimer