వచ్చే ఏడాదికి కూడా పవన్ డైరీ ఫుల్ అయ్యింది

0

అజ్ఞాతవాసి చిత్రం తర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకున్న పవన్ కళ్యాణ్ ఆర్థిక వనరుల కోసం అంటూ మళ్లీ సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చాడు. రాజకీయాలు చేస్తూనే సినిమాలు చేసి నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే నిర్ణయానికి పవన్ వచ్చినట్లుగా తెలుస్తోంది. అందుకే ఇప్పటికే మూడు సినిమాలకు ఓకే చెప్పాడు. ఆ మూడు సినిమాలు అధికారికంగా ప్రకటన కూడా వచ్చాయి. ఇప్పుడు మరో రెండు మూడు సినిమాలు చర్చల దశలో ఉన్నట్లుగా సమాచారం అందుతోంది.

ఇటీవలే పవన్ 29వ సినిమాకు ఓకే చెప్పాడు. ప్రముఖ నిర్మాతకు పవన్ హామీ ఇచ్చాడని తెలుస్తోంది. ప్రముఖ దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు. పవన్ వరుసగా చేస్తున్నా సినిమాలన్నింటికి కూడా మూడు నుండి నాలుగు నెలల సమయం మాత్రమే కేటాయిస్తున్నాడు. అందులో కూడా తాను రాజకీయాలు చేసుకునే విధంగా ప్లాన్ చేస్తున్నారు. పవన్ తో భారీ బడ్జెట్ సినిమాలు కాకుండా సింపుల్ కమర్షియల్ ఎంటర్ టైనర్ కథలతో సినిమాలు చేసేందుకు డైరెక్టర్స్ కథలు సిద్దం చేస్తున్నారు.

పవన్ గోపాల గోపాల చిత్రం సీక్వెల్ ను మరియు డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఒక సినిమాను కూడా చేసేందుకు ఒప్పుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మొత్తానికి ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చిన మూడు సినిమాలు కాకుండా మరో మూడు సినిమాలు కూడా సెట్ అయ్యాయి. ఈ మూడు సినిమాలు ఈ ఏడాదిలో వస్తే ఆ మూడు సినిమాలు వచ్చే ఏడాదిలో పట్టాలెక్కబోతున్నాయి. వచ్చే ఏడాదిలోనే ఆ మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

అభిమానులు కోరుకున్నట్లు గా వరుసగా పవన్ సినిమాలు చేయడం తో వారు సంతోషం గా ఉన్నారు. 2021 క్యాలెండర్ లో కూడా పవన్ డేట్లు ఫుల్ అవ్వడం జరిగిందని.. వరుసగా చిత్రాలు చేయడంతో ప్రేక్షకుల్లో ఉంటూ రాజకీయాల్లో బలం పెంచుకోవాలని పవన్ భావిస్తున్నట్లుగా ఆయన సన్నిహితులు అంటున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు పవన్ సినిమాలు చేస్తూనే ఉంటాడేమో చూడాలి.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-