వకీల్ సాబ్ కోర్టుకు వెళ్లేది ఎప్పుడంటే..!

0

బాలీవుడ్ హిట్ మూవీ పింక్ రీమేక్ తో పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. పవన్ 26వ చిత్రంగా రూపొందుతున్న వకీల్ సాబ్ సమ్మర్ లోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్నా కూడా మహమ్మారి వైరస్ కారణంగా షూటింగ్ కూడా ఇంకా పూర్తి కాలేదు. మరో 20 రోజుల షూటింగ్ బ్యాలన్స్ ఉన్నట్లుగా చెబుతున్నారు. గత నెల నుండి మళ్లీ షూటింగ్స్ కు అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో వకీల్ సాబ్ ను కూడా పున: ప్రారంభించినట్లుగా వార్తలు వచ్చాయి.

మొదట వారం రోజులు పవన్ కళ్యాణ్ లేకుండా ముఖ్యమైన నటీనటులతో షూట్ చేసి ఆ తర్వాత పవన్ ను జాయిన్ చేయబోతున్నట్లుగా పుకార్లు వినిపించాయి. అయితే చిత్ర యూనిట్ సభ్యులు షూటింగ్ ను ఇప్పట్లో మొదలు పెట్టేందుకు ఆసక్తిగా లేరని తెలుస్తోంది. వకీల్ సాబ్ షూటింగ్ పున: ప్రారంభం సెప్టెంబర్ నుండి ఉంటుందని అంటున్నారు. కోర్టుకు సంబంధించిన షూటింగ్ ను నిర్వహించనున్నారు.

ఆగస్టులో వైరస్ కు సంబంధించిన వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. కేంద్రం కూడా చాలా నమ్మకంతో ఆగస్టులో వ్యాక్సిన్ వస్తుందని అంటుంది. అందుకే సెప్టెంబర్ వరకు షూటింగ్ ను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారు. రిస్క్ తీసుకుని షూటింగ్ వెళ్లి హడావుడిగా విడుదల చేసేది కూడా లేదు. అందుకే కాస్త ఆలస్యంగానే షూటింగ్ ను మొదలు పెట్టాలని నిర్ణయించారట.