మెగా ఫ్యామిలీలో 12వ ప్లేయర్?

0

మెగా ఫ్యామిలీలో ఇప్పటికే లెవన్ ప్లేయర్స్ గురించి పరిశ్రమలో ఆసక్తికర చర్చ సాగుతోంది. మెగా వృక్షం కింద అంతమంది సేద దీరుతున్నారు. స్టార్లుగా పరిశ్రమకు అంకితమయ్యారు అన్న డిస్కషన్ అన్నివేళా సాగుతూనే ఉంటుంది. చిరంజీవి-నాగబాబు-రామ్ చరణ్- అల్లు అర్జున్- సాయి తేజ్- అల్లు శిరీష్- వరుణ్ తేజ్ – నీహారిక – వైష్ణవ్ తేజ్ – కళ్యాణ్ దేవ్ .. ఇంతమంది స్టార్లు ఆ ఫ్యామిలీలో ఉన్నారు. వీళ్లతో పాటు పవన్ వారసుడు అఖీరా నందన్ ఓ మరాఠా చిత్రంలో నటించాడు.

ఇప్పుడు మరో అడిషన్ గురించి చర్చ సాగుతోంది. మెగా ఫ్యామిలీ నుంచి 12వ ప్లేయర్ అంటూ అభిమానుల్లో చర్చ మొదలైంది. ఇంతకీ ఎవరీ కుర్రాడు? అంటే.. పవన్ తేజ్ కొణిదెల. అతడు రామ్ చరణ్ కి తమ్ముడు వరస అని తెలుస్తోంది. అయితే చరణ్ కి సోదరుడే అయితే గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వాలి కదా! అంటారా.. కానీ పవన్ తేజ్ కి యూనిక్ క్వాలిటీ ఉంది. తాన స్వశక్తితో ఎదగాలన్న తాపత్రయంతో ఉన్నాడట. అందుకు ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నాడని చెబుతున్నారు.

పవన్ తేజ్ కొణిదెలని హీరోగా పరిచయం చేస్తూ.. డెబ్యూ అభిరామ్ దర్శకత్వంలో నిర్మాత రాజేష్ నాయుడు ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నారు. ఈ సినిమాకి `ఈ కథలో పాత్రలు కల్పితం` అనే టైటిల్ ని ప్రకటించారు. పవన్ తేజ్ గతం గురించి పరిశీలిస్తే.. అతడు ఖైదీ నెం.150- రంగస్థలం- వాల్మీకి వంటి సినిమాల్లో నటించాడు. బ్రదర్స్ సమక్షంలోనే ఆల్మోస్ట్ నటనలో తర్ఫీదును పొందాడట. మొత్తానికి మెగా ఫ్యామిలీ 12వ ఆటగాడు ఏ మేరకు రాణిస్తాడు? మెగా సపోర్ట్ ఎంతవరకూ దక్కనుంది? అన్నదానికి కాలమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. బహుశా దేవరకొండలా వైబ్రేంట్ గా ట్యాలెంట్ ని చూపిస్తే అప్పుడు మెగా హీరోలంతా సపోర్ట్ నిస్తారేమో?
Please Read Disclaimer