ఎన్టీఆర్ గురించి మీకు ఏమీ తెలియదు

0

పాయల్ ఘోష్.. మంచు మనోజ్ – చంద్రశేఖర్ యేలేటి కాంబోలో రూపొందిన ‘ప్రయాణం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘ఊసరవెల్లి’ సినిమాలో మెరిసింది. ఇక ‘మిస్టర్ రాస్కెల్’ అనే సినిమాలో నటిచింది కానీ ఏ సినిమా ఈ భామకు సరైన గుర్తింపును తీసుకురాలేదు. దీంతో అమ్మడు బాలీవుడ్ కి చెక్కేసింది. అయితే అక్కడ కూడా పాయల్ కి పెద్దగా ఆఫర్స్ రాలేదు. అయితే పాయల్ ఘోష్ సినిమాల కంటే సోషల్ మీడియా ద్వారానే ఎక్కువగా ఫేమస్ అవుతూ వచ్చిందని చెప్పొచ్చు. ఇప్పుడు తాజాగా ఎన్టీఆర్ మీద ట్వీట్ చేసి మరోసారి వార్తల్లో నిలిచింది పాయల్.

ఇటీవల ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీరా చోప్రాను టార్గెట్ చేస్తూ తీవ్ర పదజాలంతో దూషించడం.. బెదిరించడం అప్పట్లో సంచలన న్యూస్ అయింది. దీనిపై మీరా చోప్రా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు మహిళా కమిషన్ కి కంప్లైంట్ చేసింది. అప్పుడు ఈ వార్త నేషనల్ వైడ్ ట్రెండింగ్ టాపిక్ గా మారింది. అప్పుడే ఈ వివాదంలోకి పాయల్ ఘోష్ ఎంటరై ‘ఎన్టీఆర్ కు మహిళలను ఎంతో గౌరవిస్తాడని’ చెప్పి అతనికి మద్దతుగా నిలిచి టాలీవుడ్ లో అందరూ ఆమెని గుర్తు చేసుకునేలా చేసింది. ఇక ఇటీవల సుశాంత్ మరణంపై.. నెపోటిజం మరియు బాలీవుడ్ లో జరిగే అక్రమాలపై స్పందించి వార్తల్లో నిలిచింది. ఈ క్రమంలో బాలీవుడ్ ఓ నరకమని.. దీని వలన డిప్రెషన్ కి లోనయ్యానని.. టాలీవుడ్ దక్షిణాది సినీ పరిశ్రమ ఎంతో గొప్పవని స్వర్గం లాంటివని.. టాలీవుడ్ ను వదిలి చాలా పెద్ద తప్పు చేశానని చెప్పుకొచ్చింది.

ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ కూడా నట వారసత్వంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన హీరో అని.. నెపోటిజం వల్ల వచ్చిన ఎన్టీఆర్ కి మీరు సపోర్ట్ చేస్తున్నారంటూ నెటిజన్స్ పాయల్ కి ట్వీట్స్ పెట్టారు. ఈ క్రమంలో పాయల్ ఘోష్ వీటిపై స్పందించి ట్విట్టర్ వేదికగా వారిపై తీవ్ర స్థాయిలో మండిపడింది. ”తారక్ కూడా నెపోటిజం ప్రొడక్టే కదా నువ్వు ఎలా సపోర్ట్ చేస్తున్నావంటూ కంటిన్యూస్ గా మెసేజెస్ చేస్తున్నారు. మీకు కచ్చితంగా ఆయన గురించి ఏమీ తెలిసి ఉండదు. అతనో హార్డ్ షిప్ ఎంతో కష్టపడి వచ్చాడు. సో మీరంతా మూసుకుని ఉండండి” అంటూ ట్వీట్ చేసింది. దీనిపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ రియాక్ట్ అవుతూ తమ అభిమాన హీరోకి మద్దతుగా నిలుస్తున్నందుకు థ్యాంక్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
Please Read Disclaimer