ఇంకా భ్రమలోనే ఉన్న పాయల్!

0

పాయల్ రాజ్ పుత్ నటించిన ‘RDX లవ్’ ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక సినిమాకు ఎంత బ్యాడ్ టాక్ రాకూడదో అంత బ్యాడ్ టాక్ వచ్చింది. రేటింగులు కూడా దాదాపు 1 లోపే ఉన్నాయి. ఇక చాలామంది క్రిటిక్స్ ఈ సినిమాను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. బూతు క్రియేటివిటీ తట్టుకోలేక చాలమంది సాధారణ ప్రేక్షకులు కూడా సోషల్ మీడియాలో ఈ సినిమాను తిట్టిపోస్తున్నారు. అయితే పాయల్ రాజ్ పుత్ మాత్రం తనేదో అద్భుతమైన సినిమా చేశానన్న భ్రమలో నుంచి ఇంకా బైటకు వచ్చినట్టు లేదు.

ఈరోజు పాయల్ తన ట్విట్టర్ ద్వారా ఈ సినిమాను జనాలు ‘ఆహా ఓహో’ అని మెచ్చుకునే ఒక పబ్లిక్ టాక్ వీడియోను షేర్ చేసింది. మరి దీనికి పూర్తి వ్యక్తిరేకమైన పబ్లిక్ టాక్ లు యూట్యూబ్ లో పదులకొద్ది ఉన్నాయి. పాయల్ షేర్ చేసిన వీడియోతో ఆగకుండా మరో ట్వీట్ వేసింది. “RDX లవ్ లో నా నటనను ప్రశంసిస్తున్న వారికి కృతజ్ఞతలు. RX100 తర్వాత ఒక ఫిమేల్ ఓరియంటెడ్ మూవీ చేయడం నాకు చాలా కష్టమైన నిర్ణయం. నా పేరుతో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలనా లేదా అని భయపడ్డాను. కానీ నేను అది సాధించగలిగాను. థ్యాంక్ యూ” అంటూ తన ఆనందాన్ని పంచుకుంది.

తన పేరుతో ప్రేక్షకులను థియేటర్లకైతే రప్పించగలిగింది కానీ వారి నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయింది. ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో పాయల్ చాలా మాటలే చెప్పింది కానీ సినిమా మాత్రం దానికి పూర్తిగా ఉంది. ఇలాంటి సినిమాలు చేస్తే పెద్ద హీరోల సినిమాలకు ఇకపై తనపేరు ను కనీసం పరిశీలించడానికి కూడా ఆలోచిస్తారని.. పాయల్ జాగ్రత్తగా ఉండాలని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
Please Read Disclaimer