పాయల్ ఒంపుల్ సొంపుల్

0

ఆర్.ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్ పుత్ స్పీడ్ గురించి చెప్పాల్సిన పనే లేదు. దీపం ఉండగానే ఈ అమ్మడు కెరీర్ ని చక్కదిద్దుకునే పనిలో ఉంది. 2019 ఎండింగులో రిలీజైన వెంకీ మామ సైలెంట్ హిట్ కొట్టింది. ఇందులో పాయల్ కాస్త ఘాటైన లుక్ తోనే మైమరిపించింది. అయితే ఆర్.డీ.ఎక్స్ బాంబ్ అంటూ డీగ్రేడ్ సినిమా చేయడంతో అది కాస్తా తన కెరీర్ కి పెద్ద మైనస్ గా మారింది. ఇటీవలే రిలీజైన డిస్కో రాజా ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద ఫెయిలవ్వడంతో అది కూడా తనకి బ్యాడ్ అయ్యింది.

ప్రస్తుతం తమిళంలో ఒకే ఒక్క సినిమా చేస్తోంది. ఉదయనిధి స్టాలిన్ సరసన ఏంజెల్ అనే చిత్రంలో నాయికగా నటిస్తోంది. ఇదో హారర్ సినిమా. కే.ఎస్.అదియమాన్ దర్శకత్వం వహిస్తున్నారు. వాస్తవానికి ఈ పాటికే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఎందుకనో అంతకంతకు ఆలస్యమవుతోంది.

అయితే ఈలోగానే తనని తాను లైమ్ లైట్ లో ఉంచుకునేందుకు పాయల్ వేస్తున్న ఎత్తుగడలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటికే ఈ అమ్మడు ఇన్ స్టాలో అదిరిపోయే విజువల్ ట్రీటిస్తున్న సంగతి తెలిసిందే. రెగ్యులర్ గా వేడెక్కించే ఫోటోషూట్లను షేర్ చేస్తూ కుర్రకారు కంటికి కునుకుపట్టనివ్వని ట్రీటిస్తోంది. తాజాగా టాప్ టు బాటమ్ సిల్వర్ మెరుపులతో పాయల్ తళుకుబెళుకులు కిర్రాక్ పుట్టించాయి. ఆ మెడలో హారం ప్రత్యేక మైన డిజైన్ తో ఆకర్షిస్తోంది. ఆ పాక్షిక వస్త్రాల నడుమ ఒంపుసొంపులు కుర్రకారును కవ్విస్తున్నాయి. మిల్కీ అందాలతో మిల్కీ బ్యూటీ 2ని మరిపిస్తోంది మరి. కనీసం ఈ ప్రయత్నం చూశాక అయినా మన స్టార్ హీరోలు ఎవరైనా అవకాశం ఇస్తారేమో చూడాలి. కనీసం కుర్రహీరోలు అయినా స్పందించరేమిటో?
Please Read Disclaimer