ఇంకా ఏం మిగిలిందని చూపించేందుకు?

0

అందాల ఆరబోతకు .. బోల్డ్ సీన్స్ లో నటించేందుకు ఏమాత్రం అడ్డు చెప్పని నాయికగా పాయల్ రాజ్ పుత్ కి ప్రత్యేకించి ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ టాలీవుడ్ లో తనకు వరుస అవకాశాలిస్తోంది. ఇంతకుముందు ఆర్.ఎక్స్ 100- ఆర్డీఎక్స్ లవ్ వంటి బోల్డ్ కంటెంట్ ఉన్న చిత్రాల్లో నటించిన పాయల్ ఇటీవలే వెంకీమామ లాంటి విలేజ్ బ్యాక్ డ్రాప్ ఫ్యామిలీ మూవీలో నటించి విజయాన్ని ఖాతాలో వేసుకుంది.

RX100 చిత్రంతో పాయల్ కి వచ్చిన ఇమేజ్ తనకు ఒకరకంగా పెద్ద మైనస్ అయ్యింది. ఆ సినిమాలో పెదవి ముద్దులు .. వేడెక్కించే సన్నివేశాలు చూసి ఆ తరహా అవకాశాలు ఇచ్చేందుకు మన నిర్మాతలు వెనకాడలేదు. అంతేకాదు.. తనను ఓ నిర్మాత కమిట్ మెంట్ అడిగాడని.. ఆ సమయంలో అతడిని కొట్టేంత ని చేశానని ఇటీవల ఓపెన్ గానే చెప్పి షాకిచ్చింది.

తాజాగా పాయల్ సోషల్ మీడియాలో ఇచ్చిన సర్ ప్రైజ్ ట్రీట్ కి కుర్రకారుకు మైండ్ బ్లాక్ అయ్యిందనే చెప్పాలి. పాయల్ మునుపటి కంటే బోల్డ్ కంటెంట్ తో దూసుకొచ్చింది. ఒంపుసొంపుల వయ్యారాల్ని వడ్డిస్తూనే.. ఆ థైస్ సౌందర్యాన్ని ఎలాంటి మొహమాటం లేకుండా ఎలివేట్ చేసింది. ఇలా సోషల్ మీడియాలోకి వచ్చింది ఆలస్యం.. ఆ ఫోటో జోరుగా వైరల్ అయిపోతోంది. అయితే పాయల్ మరీ ఇంతగా రెచ్చిపోతే ఆర్.డీ.ఎక్స్ తరహా అవకాశాలే దక్కుతాయేమో! అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. పాయల్ బాడీ లాంగ్వేజ్ కి ఆ తరహానే బెస్ట్ అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Please Read Disclaimer