జిల్ జిల్ బ్యాకెండ్

0

“టాలీవుడ్ లో ఓ ముగ్గురు బోల్డ్ హీరోయిన్ల పేర్లు చెప్పండి?” అని అడిగితే ప్రేక్షకులు చాలా పేర్లు చెప్తారేమో. అయితే ఆ పేర్లలో ఖచ్చితంగా ఉండే ఒక పేరు మాత్రం పాయల్ రాజ్ పుత్. ‘RX100’ లాంటి సెన్సేషనల్ హిట్ తో టాలీవుడ్ కు పరిచయం అయింది పాయల్. తన మొదటి సినిమాతోనే నటనలోనూ.. బోల్డ్ నెస్ లోనూ తనకు సాటిలేదని అనిపించుకుంది. నెగెటివ్ టచ్ ఉన్న పాత్రను పోషించడంతో పాటుగా హీరో కార్తికేయతో కలిసి ఘాటుగా ముద్దుల ఉత్సవం జరపడంతో యూత్ లో భారీ క్రేజ్ తెచ్చుకుంది. ఇక అంతటితో ఆగకుండా సోషల్ మీడియాలో డిజిటల్ మంటలు పెడుతూ ఉంది.

తాజాగా పాయల్ తన ఇన్స్టా ఖాతా ద్వారా కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది. ఈ ఫోటోలకు “లుక్స్ మాత్రమే అంతా కాదని నాకు తెలుసు. ఒకవేళ అవసరమైతే మాత్రం.. ఆ లుక్స్ నాకు ఉన్నాయి” అంటూ హాటు వేదాంతం వల్లించింది. ఈ ఫోటోలలో పాయల్ స్లీవ్ లెస్ – బ్యాక్ లెస్ బ్లాక్ గౌన్ ధరించి సెన్సువల్ పోజులిచ్చింది.. ఆ డ్రెస్ కు తగ్గట్టుగా అందమైన యాక్సెసరీస్ ధరించింది. పాయల్ తన క్యాప్షన్ లో చెప్పినట్టుగా ‘లుక్స్’ ఉన్నాయి. యమా హాటు.. హాటస్య హాటోభ్యః.. ఇలా ఎన్ని ఉపమానాలు చెప్పుకుంటూ పోయినా అవి ఆ హాట్ లుక్స్ కు సరైన కొలమానాలు కాదు.

ఇలాంటి ఫోటోల కోసమే కాచుక్కూచున్న నెటిజన్లు అందమైన కామెంట్లతో రెచ్చిపోయారు. “పాయల్ బ్యాక్ లెస్.. అందరూ స్లీప్ లెస్”.. “ఇది బెస్ట్ బ్యాక్”.. “జిల్ జిల్ బ్యాకెండ్” అంటూ తమ మనసులోని హాటు ప్రేమను వ్యక్తం చేశారు. పాయల్ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే ప్రస్తుతం టాలీవుడ్ లో ‘వెంకీమామ’.. ‘డిస్కో రాజా’.. ‘RDX లవ్’ చిత్రాల్లో నటిస్తోంది. ఇవి కాకుండా తమిళంలో ‘ఏంజెల్’ అనే సినిమాలో కూడా యాక్ట్ చేస్తోంది.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home