బోల్డ్ నెస్ టన్నుల్లో ఉంది

0

మొదటి సినిమా హిట్ కావడం.. ప్రేక్షకుల్లో గుర్తింపు సాధించడం అనేది చాలా తక్కువమందికి జరుగుతుంది. సరిగ్గా అలాంటి లక్కీ బ్యూటీనే పాయల్ రాజ్ పుత్. డెబ్యూ సినిమా ‘RX100’ సెన్సేషనల్ హిట్ కావడంతో భారీగా పాపులారిటీ సాధించింది పాయల్. బోల్డ్ భామ ట్యాగ్ ను కూడా సాధించింది. ఆ ఇమేజ్ కు తగ్గట్టే బోల్డ్ ఫోటో షూట్లు చేస్తూ సామాజిక మాధ్యమాల తిత్తి తీస్తోంది.

తాజాగా పాయల్ మరోసారి ఒక ఘాటు ఫోటోషూట్ లో పాల్గొంది. పింక్ టీ షర్టును విప్పుతున్నట్టుగా పోజిచ్చింది. ఫేస్ లో ఓ హాట్ ఎక్స్ ప్రెషన్.. కిందేమో కె. రాఘవేంద్ర రావు గారి ఫేవరెట్ ఏరియా కనిపిస్తోంది. మరి పాయల్ ఎందుకు ఇలా చేస్తోందనేది తెలియదు. ఆ రోజుల్లో అయితే బత్తాయిలు నారింజలు ఉండేవి. వాటిని విసిరే రొమాంటిక్ బౌలర్లు ఉండేవారు. ఇప్పడు హీరోలకు అంత ఛాన్సు లేదు. ఎందుకంటే ఇప్పుడంతా ఫెమినిజం.. మీటూలు.. F2 లు. ఇలాంటి మోటు రొమాన్స్ అంటే చాలు జడుసుకుంటున్నారు.. తూర్పు తిరిగి దండం పెడుతున్నారు. అయినా పాయల్ అలా ఎందుకు చేసిందో అర్థం కావడం లేదు. నెటిజన్లు ఏమైనా డిజిటల్ బత్తాయిలు వేస్తారని ఆశపడిందేమో!

జోక్స్ ఎపార్ట్.. ఎంతైనా ఆరెక్స్ బ్యూటీ కదా. త్వరలో ‘RDX లవ్’ అనే మరో బోల్డ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆరెక్స్ కు ఆర్డీఎక్స్ కు మధ్యలో స్పైసీనెస్ కాస్త తగ్గిందని అనిపించిందేమో.. అందుకే ఇలాంటి ఫోటోలతో జనాలపై దాడి చేస్తోంది. ఇక సినిమాల విషయానికి వస్తే పాయల్ ‘వెంకీమామ’ తో పాటు ‘డిస్కోరాజా’ లో కూడా నటిస్తోంది.
Please Read Disclaimer