ఫేక్ ప్రచారంతో తీవ్రంగా హర్టయ్యిందట

0

ఏదైనా ప్రాజెక్ట్ కి కమిటైనా తనకు తానుగా ప్రకటించేందుకు చాలా మంది స్టార్లు ఇష్టపడరు. అట్నుంచి దర్శకనిర్మాతలే ప్రకటిస్తే బావుంటుందని వెనకాడేస్తారు. మన స్టార్లు ఇంటర్వ్యూల్లో చర్చల దశలో ఉన్న ప్రాజెక్టును కన్ఫామ్ చేసేందుకు ఇష్టపడని సందర్భాలున్నాయి. కొద్ది రోజుల్లో దర్శక నిర్మాతలే ప్రకటిస్తారని స్కిప్ కొట్టేస్తుంటారు.

అలాంటిది ఓసారి అనుకుని వద్దనుకున్న సినిమాని తన అనుమతి లేకుండానే సెట్స్ కెళుతోందని ప్రకటించేస్తే.. ఆ హీరోయిన్ హర్టవ్వకుండా ఉంటుందా? అది కూడా అంతగా పాపులర్ కాని చిన్న నిర్మాత ఇండస్ట్రీ ట్రెండ్ సెట్టింగ్ సినిమాకి సీక్వెల్ తీస్తున్నామని ఫలానా కథానాయికతో సెట్స్ పైకి తీసుకెళుతున్నామని ప్రకటన గుప్పించేస్తే అది చాలానే తేడా కొడుతుంది. ప్రస్తుతం ఇలాంటి ప్రకటన ఒకటి టాలీవుడ్ సర్కిల్స్ లో ప్రముఖంగా చర్చకు వచ్చింది. ఆర్.ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్ పుత్ నాయికగా అరుంధతి సీక్వెల్ తీస్తున్నామని ఓ నిర్మాత అధికారికంగా ప్రకటన విడుదల చేయడంపై ఇటీవల ఆసక్తికర చర్చ సాగింది.

అయితే తనకు తెలియకుండానే సదరు నిర్మాత ఈ ప్రకటన చేసేయడంతో పాయల్ తీవ్రంగా హర్టయ్యిందట. తొలి మూవీతోనే బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న పాయల్ ప్రస్తుతం కెరీర్ పరంగా ఫుల్ స్వింగులో ఉన్న సంగతి తెలిసిందే. వెంకీ మామ- డిస్కో రాజా- ఆర్.డీ.ఎక్స్ అనే మూడు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అలాగే తనవైపు వచ్చిన రకరకాల కథల్ని వింటోందట. అరుంధతి సీక్వెల్ కథ అంటూ ఓ చిన్న నిర్మాత తనని ఎప్రోచ్ అయ్యాడు. కానీ ఆ సినిమాని తాను చేయాలని అనుకోలేదు. దాంతో అంగీకార పత్రంపై సంతకం కూడా చేయలేదు. అయినా సదరు నిర్మాత తన అనుమతితో పని లేకుండా నిర్లక్ష్యంగా ప్రకటన గుప్పించేశాడు. ఆ సంగతి తెలిసిన పాయల్ సదరు నిర్మాత ఉద్ధేశాన్ని ప్రశ్నించేందుకు రెడీ అయ్యిందట. ప్రస్తుతం దీనిపై టాలీవుడ్ లో ఆసక్తికర చర్చ సాగుతోంది. అనుష్క నటించిన అరుంధతి చిత్రాన్ని టాప్ ప్రొడ్యూసర్ శ్యాంప్రసాద్ రెడ్డి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు. ఆ సినిమాకి సీక్వెల్ తీసే హక్కు కూడా అతడికే ఉంది. కానీ వేరొక నిర్మాత నుంచి ప్రకటన వెలువడడంతో అంతా షాక్ కి గురయిన సంగతి విదితమే.
Please Read Disclaimer