స్పైసీ ట్రీట్ ఇస్తున్న ఆరెక్స్ పాప

0

RX100′ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయిన ముంబై బ్యూటీ పాయల్ రాజ్ పుత్. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ సాధించడంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. హీరో కార్తికేయకు ఆరమరికలు లేకుండా ముద్దులిచ్చి ప్రేమలో పడేయడంతో పాటుగా తెలుగు యూతును తన మాయలో పడేసింది. చేతిలో కొన్ని క్రేజీ ఆఫర్లు కూడా ఉన్నాయి. అలా అని వాటితో సంతృప్తి చెందకుండా క్రేజ్ ఇంకా పెంచుకునేందుకు హాట్ ఫోటో షూట్లు… సోషల్ మీడియా రచ్చతో అందరినీ ఆకర్షించే ప్రయత్నాలు చేస్తోంది.

రీసెంట్ గా ఈ ఆరెక్స్ పాప ఒక అందమైన బీచ్ లొకేషన్లో బ్లాక్ బికినీ ధరించి జలకాలాడింది. సముద్రపు నీరు ఎంత స్వచ్చంగా ఉందంటే.. నీటి కింద ఉండే నేల క్లియర్ గా కనిపిస్తోంది. అలాంటి స్వచ్ఛమైన నీటిలో 24 క్యారెట్ గోల్డ్ లాంటి ప్యూర్ గ్లామర్ ఉన్న బ్యూటీ బికినీలో జలకాలడితే.. ఈ భూగోళ తాపం పెరగదా? మునిగే బ్యూటీకి వాటర్ సాల్ట్ గా ఉంటాయి.. చూసే నెటిజన్లకు మాత్రం స్పైసీ ట్రీటే కదా? అందుకే ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్లుగా వైరల్ అయ్యాయి. అంతా బాగానే ఉంది కానీ పాయల్ వేసుకున్న బికినీని పర్ఫెక్ట్ బికినీ అని పిలవలేం..ఎందుకంటే నిక్కర్ లాంటి ఓ మైక్రో వేసుకుంది. పాయల్.. బిల్కుల్ నయా లడ్కీ కదా.. దిశా పటాని లాంటి సీనియర్లను ఫాలో అయితే ‘వాట్ ఈజ్ రియల్ బికినీ’ అనేది తెలుస్తుంది.

మరి ఈ ఫోటోలను సాధారణ నెటిజన్లు చూస్తే పాయల్ కు ఏం లాభమో ఏమో కానీ ఫిలిం మేకర్లు చూస్తే మాత్రం రొంబ లాభం. అప్పుడే కదా ఇంకా ఇంకా ఆఫర్లు వచ్చేది. అవి లేకుండా సాధారణ నెటిజన్లు ఎన్ని లైకులు కొట్టి.. ఎన్ని కామెంట్లు పెట్టి ఏం ప్రయోజనం? పాయల్ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే.. ప్రస్తుతం ‘వెంకీ మామ’ లో నటిస్తోంది. తమిళంలో ‘ఏంజెల్’ అనే చిత్రంలో పంజాబీలో ‘హాన్జీ హాన్జీ’ అనే సినిమాలో కూడా నటిస్తోంది. తెలుగులో మరో రెండు సినిమాలు కూడా లైన్లో ఉన్నాయట.