పాయల్ రొట్టె నెయ్యిలో పడిందా?

0

ఆర్.ఎక్స్ 100 చిత్రంతో బోల్డ్ అండ్ డస్కీ బ్యూటీగా పరిచయమైంది పాయల్ రాజ్ పుత్. ఇటీవలే వెంకీమామలో విక్టరీ వెంకటేష్ సరసన నాయికగా నటించింది. వెంకీమామ కమర్షియల్ గా వర్కవుటైనా పాయల్ కి కలిసొచ్చిందేమైనా ఉందా? అంటే అలాంటిదేమీ కనిపించడం లేదు.

అయితే పాయల్ ఈసారి ఓ భారీ ప్రయోగానికి సిద్ధపడడం హాట్ టాపిక్ గా మారింది. తీన్ మార్ ఫేం జయంత్ . సి ఫరాన్జీ తెరకెక్కిస్తున్న ప్రయోగాత్మక చిత్రంలో పాయల్ అవకాశం దక్కించుకుంది. ఈ సినిమా టైటిల్ నరేంద్ర. భారత వైమానిక దళ అధికారి సాహసగాధతో తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో ది గ్రేట్ కాళీ ఆ సక్తికర పాత్రలో నటిస్తుండగా.. ఆర్.ఆర్.ఆర్ చిత్రంతో టాలీవుడ్ లో ప్రవేశిస్తున్న ఇజబెల్లా లాయిటే మానవ హక్కుల పోరాటానికి సంబంధించిన యాక్టివిస్టుగా కనిపించనుంది.

ఈ చిత్రంలో పాయల్ వైమానిక దళ అధికారిగా సాహసిగా నటిస్తుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇషాన్ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. నీలేష్ ఏటి అనే కొత్త కుర్రాడు ఈ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని అప్ డేట్స్ తెలియాల్సి ఉంది.
Please Read Disclaimer