2019 బెస్ట్ ఐటెమ్ బ్యూటీ ఈవిడే!

0

ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే..! అంటూ ముమైత్ ఖాన్ వేసిన స్టెప్పులకు కోట్లాది మంది ఫ్యాన్స్ అయ్యారు. నేటికీ ఆ పాట గురించి తెలుగు జనం మాట్లాడుకుంటారు. ఆ తర్వాత ముమైత్ ఎన్నో మైమరిపించే ఐటెమ్ నంబర్స్ తో తెలుగు యువత గుండెల్లో నిలిచింది. ఆ తర్వాత బిజినెస్ మేన్ సినిమాలో వియ్ లవ్ బ్యాడ్ బోయ్స్.. సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. పూరి దర్శకత్వం వహించిన ప్రతి సినిమాలో ఐటెమ్ నంబర్ కి ఉన్న ప్రాధాన్యత గురించి – ఆ ఐటెమ్ తో విదేశీ ముద్దుగుమ్మలకు వచ్చిన పాపులారిటీ మర్చిపోలేనిది.

ప్రస్తుతం ఆ రేంజులో పాపులారిటీ దక్కించుకునే ఐటెమ్ నంబర్ లో పాయల్ రాజ్ పుత్ నర్తిస్తోందా? అంటే అవుననే దర్శకుడు తేజ కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్- కాజల్ జంటగా తేజ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం సీత లో పాయల్ ఓ ఐటెమ్ నంబర్ చేస్తోంది. ఆ పాట తనకు చాలా గుర్తింపు తెస్తుంది. ఈ పాట కోసం ఏకంగా వారం పైగానే పాయల్ ఎంతో శ్రద్ధగా ప్రాక్టీస్ చేసింది. కొరియోగ్రాఫర్ కి సహకరించి నేర్చుకుంది.. తన మూవ్స్ వేడి పెంచేయడం ఖాయం .. 2019 బెస్ట్ ఐటెమ్ నంబర్ ఇదే అవుతుంది అంటూ ఆకాశానికెత్తేశాడు. మొత్తానికి పాయల్ స్లోగా వెళుతున్నా స్టడీగా వెళుతోందని తాజా సన్నివేశం చెబుతోంది.

తేజ అంతటి కాంప్లికేటెడ్ ఠఫ్ టాస్క్ మాస్టర్ మెప్పు పొందిందంటే పాయల్ కి ఇక ఎదురే లేదని చెప్పొచ్చు. ఈ ప్రశంసలకు పాయల్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతోంది. నా కెరీర్ తొలి ఐటెమ్ పాట ఇది. తేజ సర్ ప్రశంస నా కెరీర్ కి బిగ్ బూస్ట్ నిస్తుందని పాయల్ ఆనందం వ్యక్తం చేసింది. పాయల్ ఈ సినిమాతో పాటు వెంకీ మామ లో కథానాయికగా నటిస్తోంది. భానుశంకర్ దర్శకత్వంలో ఓ నాయికా ప్రధాన చిత్రంలో నటిస్తోంది. అలాగే తమిళంలో ఉదయనిధి స్టాలిన్ సరసన ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
Please Read Disclaimer