మజిల్ పెంచిన పాయల్.. ఎవరిని కొడుతుందట?

0

సోషల్ మీడియాల్లో ఆర్.ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్ పుత్ స్పీడ్ గురించి చెప్పాల్సిన పనే లేదు. ఇటీవల వరుస ఫోటోషూట్లతో అంతకంతకు హీట్ పెంచేస్తోంది. ఇన్ స్టాలో ఏకంగా 25 లక్షల మందికి రెగ్యులర్ బేసిస్ లో ట్రీటిస్తోంది. ఇటీవల మెగాస్టార్ బర్త్ డే రోజున ఫ్యాన్స్ రూపొందించిన కామన్ డీపీని షేర్ చేసిన సంగతి తెలిసిందే. మెగా యువ హీరోల సరసన ఆఫర్ అందుకోవడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేనేలేదని చెప్పకనే చెప్పింది.

తాజాగా `హజల్ ఫర్ ది మజల్` అంటూ మజిల్ ఈమోజీని షేర్ చేస్తూ మజిల్స్ పెంచిన ఫోటోని పాయల్ షేర్ చేసింది. మజిల్ బాగా పెంచడానికి ఇంకా చాలా సమయం పడుతుందని కూడా హింట్ ఇచ్చింది. మొత్తానికి హాలీవుడ్ స్టార్ లా.. WWF స్పోర్ట్స్ ఉమెన్ లా పాయల్ ఇంకేదైనా ప్లాన్ చేస్తోందా? ఏదైనా స్పోర్ట్స్ బయోపిక్ లో నటిస్తోందా? అన్నది చూడాలి.

అయినా ఇలా ఏటవాలుగా చూస్తూ కుర్రకారును అంతగా కవ్వించాలా? టాప్ టు బాటమ్ బ్లాక్ స్పోర్ట్స్ డ్రెస్ లో పాయల్ ఇచ్చిన లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాల్లో వైరల్ గా మారింది. ఇక ఈ అమ్మడు డేనియల్ వెల్లింగ్ టన్ లాంటి ప్రఖ్యాత వాచ్ కంపెనీకి ప్రమోట్ చేస్తోంది. ఇన్ స్టాలో పలు కమర్షియల్ ప్రకటనల రూపంలో లక్షల్లో ఆదాయం వెనకేసుకుంటోంది ఈ బ్యూటీ. వెంకీమామ- డిస్కో రాజా తర్వాత ఏంజెల్ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాతో కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. అలాగే నరేంద్ర అనే తెలుగు చిత్రంలోనూ పాయల్ నటిస్తోంది. ఇవన్నీ మహమ్మారీ లాక్ డౌన్ వల్ల చిత్రీకరణలు ఆలస్యమవుతున్న సంగతి తెలిసిందే.