RX జస్ట్ బోల్డ్… RDX అయితే యమా బూతు!

0

ఏది బోల్డ్.. ఏది బూతు? ఇలాంటివాటికి డెఫినిషన్లు ఇవ్వడం చాలా కష్టం. ఒకటి మాత్రం స్పష్టం.. ఈ రెండిటిని కుటుంబ సభ్యులతో కలిసి కూర్చుని చూడలేం. ఓ హీరో కరువు ప్రాంతానికి పర్మనెంట్ బ్రాండ్ అంబాజిడర్ లా హీరోయిన్ అధరామృతాన్ని అదేపనిగా గ్రోలుతూ ఉంటే(మూతులు నాక్కోవడం అనేదానికి అందమైన తెలుగు పదాలు.. తెలుగు భాషా దినోత్సవం కదా!) దాన్ని ఏ లాజిక్ తో సమర్ధించడానికి చూసినాసరే.. కుటుంబ సభ్యులతో కలిసి చూడడం కష్టం.

అయితే అమ్మాయిలు అబ్బాయిలు కలిసి క్యాజువల్ ‘చూడగలిగే’ దాన్ని బోల్డ్ అనుకోవచ్చు. అదే ఓన్లీ అబ్బాయిల గ్యాంగ్ .. ఓన్లీ అమ్మాయిల గ్యాంగ్ చూడగలిగేవి కొన్ని ఉంటాయి అవి బూతు అనుకోవాలి. ఓన్లీ అబ్బాయిలు అనుకోండి.. అప్పుడు ఇబ్బందేమీ ఉండదు.. ఎంత బూతైనా ఎంతో అందంగా ఉంటుంది. సినిమాల విషయంలో ఇబ్బంది ఎక్కడ వస్తుంది అంటే… లవ్ పేరున బోల్డ్ సీన్లను.. బోల్డ్ పేరు చెప్పి బూతును ప్రేక్షకులపై రుద్దడానికి ప్రయత్నిస్తారు. ‘RX100’ సినిమాతో బోల్డ్ టాగ్ సాధించిన పాయల్ కొత్త సినిమా ‘RDX లవ్’ టీజర్ రిలీజ్ అయింది. కొన్ని పోస్టర్లు కూడా విడుదలయ్యాయి. వాటిని ఎంతగా ‘బోల్డ్’ అని సరిపెట్టుకుందామని అనుకున్నా మనసు ఒప్పుకోవడం లేదు.. బ్యాకెండ్ లో “అది బూతు పెద్ద బూతు బండ బూతు” అని ఎవరో కెవ్వుకెవ్వున కేకలు పెట్టినట్టు అనిపిస్తోంది.

టీజర్ రిలీజ్ పోస్టర్ లో పాయల్ నాభి అందాలను ధారపోస్తూ అదోరకంగా పడుకుని ఉండడం.. హీరో ఏమో రెండు కొబ్బరి బొండాలను రెండు చేతులతో పట్టుకొని ఒక కొబ్బరి బొండాన్ని స్ట్రా తో తాగుతూ వీలైనంత కామోద్రేకంతో పాయల్ అందాలను చూడడం.. ఇది వరస. ఈ పోస్టర్ పై ఒక నెటిజన్ చేసిన బెస్ట్ కామెంట్ ఏంటో తెలుసా.. “RDX లవ్ అనే టైటిల్ బదులు XXX లవ్ టైటిల్ పెడితే సరిపోయేదిగా?” ఇక మాటల్లేవ్.. స్వస్తి!




Please Read Disclaimer