గుప్పుగుప్పుమని పీలుస్తున్న పాయల్!

0

డెబ్యూ సినిమా ‘RX100’ సెన్సేషనల్ హిట్ కావడంతో భారీగా పాపులారిటీ సాధించింది పాయల్ రాజ్ పుత్. చేసింది ఒకే సినిమా అయినా మాత్రం ఎంతోమంది హీరోయిన్లకు దక్కని గుర్తింపు వచ్చేసింది. బోల్డ్ లిప్పులాకులతో.. నెగెటివ్ టచ్ ఉండే పాత్రలో నటించి ఆడియన్స్ ను మెస్మరైజ్ చేసింది. సోషల్ మీడియాలో కూడా ఈ భామ సూపర్ యాక్టివ్. రెగ్యులర్ గా ఏదో ఒక అప్డేట్ ఇస్తూ అభిమానులతో టచ్ లో ఉంటుంది.

తాజాగా పాయల్ తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు “ఇంకా కబీర్ సింగ్/అర్జున్ రెడ్డి మోడ్ లో ఉన్నాను. నేను నటించే కొత్త సినిమాలో ఒక షాట్ కోసం ఇలా చేయాల్సి వచ్చింది. నోట్: ధూమపానం ఆరోగ్యానికి హానికరం” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఫోటోలో మోడరన్ గెటప్ లో ఉన్న పాయల్ రెండు సిగరెట్లను ఒకేసారి కాలుస్తూ లేడీ కబీర్ సింగ్ తరహాలో కనిపిస్తోంది. ఈ డబల్ సిగరెట్ స్మోకింగ్ సీన్ ‘వెంకీమామ’ సినిమా కోసం అయి ఉండవచ్చని అంటున్నారు. ఈ ఫోటోలో పాయల్ కళ్ళకు గాగుల్స్ ధరించి.. బ్లాక్ టాప్ తో కేర్లెస్ లుక్స్ తో నిజంగానే కబీర్ సింగ్ పోస్టర్ ను గుర్తు తెస్తోంది.

ఈ ఫోటోకు నెటిజన్లు ఇంట్రెస్టింగ్ కామెంట్లు పెట్టారు. “పాయల్ రెడ్డి”.. “రౌడీ హీరోయిన్ లుక్”.. “ఫుల్ ఖతర్నాక్” ..”స్మోకింగ్ హాట్ పాయల్” అంటూ క్యాప్షన్లు ఇచ్చారు. పాయల్ ప్రస్తుతం ‘వెంకీమామ’ తో పాటు ‘డిస్కోరాజా’ లో కూడా నటిస్తోంది.
Please Read Disclaimer