రూటు మార్చబోతున్న ఆరెక్స్ పాప!

0

డెబ్యూ సినిమాతోనే హిట్ సాధించాలంటే ఎంతో లక్కు ఉండాలి. అలాంటి లక్కు ఉంది కాబట్టే పాయల్ రాజ్ పుత్ తన మొదటి సినిమా ‘RX100’ తోనే సూపర్ హిట్ సాధించింది. బోల్డ్ యాక్టింగ్ తో లిప్పు లాకులు.. గ్లామర్ షో చేసేసి యూత్ కు దగ్గరయింది. దీంతో అవకాశాలు కూడా బాగానే వచ్చాయి. అలా వచ్చిన అవకాశాలలో ‘RDX లవ్’ ఒకటి. అయితే ఆ సినిమాతో పాయల్ ఇమేజ్ చాలా డ్యామేజ్ అయింది. అయితే ఈసారి అలాంటి పొరపాట్లు చెయ్యకూడదని పాయల్ గట్టిగా నిర్ణయించుకుందట.

అలా నిర్ణయించుకోవడానికి ‘వెంకీమామ’ విజయమే కారణమని సమాచారం. డిసెంబర్ 13 న విడుదలైన ‘వెంకీమామ’ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఇప్పటికీ వసూళ్లు రాబడుతూ ‘వెంకీమామ’ టీమ్ ను సంతోషపెట్టింది. వెంకటేష్ – నాగచైతన్యలు హీరోలుగా నటించిన ఈ సినిమాలో పాయల్ సీనియర్ హీరో వెంకీకి జోడీగా నటించింది. సీనియర్ స్టార్ తో జోడీ కట్టినప్పటికీ సినిమా విజయం సాధించడం పాయల్ కు కెరీర్ కు మంచి బూస్ట్ ఇచ్చిందట. ‘వెంకీమామ’ విజయం తర్వాత పాయల్ కు కొత్త ఆఫర్లు వస్తున్నాయట. దీంతో ‘RDX లవ్’ లాంటి బీ గ్రేడ్ సినిమాలకు దూరంగా ఉండాలని డిసైడ్ అయిందట.

పెద్ద హీరోల సినిమాలు.. లేకపోతే నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమాలే చేయాలని అనుకుంటోందట. మరి ఈ కొత్త నిర్ణయం పాయల్ కెరీర్ కు ఎంతమేలు చేస్తుందో ఏమో తెలియాలంటే కొంతకాలం వేచి చూడకతప్పదు. ఇదిలా ఉంటే పాయల్ ప్రస్తుతం రవితేజ సినిమా ‘డిస్కోరాజా’ లో నటిస్తోంది. ఈ సినిమా కాకుండా తమిళంలో ‘ఏంజెల్’ అనే సినిమాలో కూడా నటిస్తోంది.
Please Read Disclaimer