వెంకీమామ ఫోటో.. అలా జరిగింది!

0

ఈమధ్య టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన వారిలో అతి తక్కువ సమయంలో భారీ గుర్తింపు సాధించిన భామ పాయల్ రాజ్ పుత్. మొదటి సినిమానే హిట్ కావడం.. బోల్డ్ యాక్టింగ్ చేయడంతో పాయల్ ఒక్కసారిగా పాపులర్ అయింది. పాయల్ త్వరలో ‘RDX లవ్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమా ప్రోమోస్ ఇప్పటికే సంచలనం సృష్టించాయి. పోస్టర్లు టీజర్ మరీ ఘాటుగా ఉన్నప్పటికీ ట్రైలర్ మాత్రం సినిమాలో కంటెంట్ ఉందనే నమ్మకాన్ని కలిగించింది. పాయల్ కూడా ఈ సినిమాపై కాన్ఫిడెంట్ గా ఉంది.

అయితే ఈ సినిమాలో పాయల్ బోల్డ్ పోస్టర్లకు.. బోల్డ్ యాక్టింగ్ కు విమర్శలు ట్రోలింగ్ కూడా జరిగింది. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పాయల్ ను ఈ ట్రోలింగ్ గురించి అడిగితే సహజంగా ఇలాంటివి పట్టించుకోనని..కొన్ని సార్లు మాత్రం హర్ట్ అవుతానని వెల్లడించింది. రీసెంట్ గా అలా మీరు అప్సెట్ అయిన సందర్భం ఉందా అని అడిగితే.. కొద్ది రోజుల క్రితం ‘వెంకీమామ’ షూట్ లొకేషన్ నుంచి ఒక ఫోటో బయటకు వచ్చిందని చెప్పింది. “ఆ ఫోటోలో నేను వెంకటేష్ గారితో గౌరవం లేకుండా ప్రవర్తించానని ఒక వీడియో చేశారు.. అది వైరల్ అయింది. నిజానికి అక్కడ జరిగింది వేరు. నేను ఆ సమయంలో ఏదో తింటూ ఉన్నాను. ఆ సమయంలో వెంకీ సర్ లాంటి స్టార్ ను హగ్ చేసుకోవడం సరి కాదని కొంచెం దూరం నుంచే షేక్ హ్యాండ్ ఇచ్చాను. కానీ నేనేదో తప్పు చేసినట్టు ప్రచారం చేశారు” అంటూ వాపోయింది

పాయల్ ‘RDX లవ్’.. ‘వెంకీమామ’ సినిమాలతో పాటుగా రవితేజ చిత్రం ‘డిస్కోరాజా’ లో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలు కాకుండా ‘ఏంజెల్’ అనే తమిళ సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.
Please Read Disclaimer