మొత్తానికి బోయ్ ఫ్రెండ్ తో దొరికింది

0

ఆర్.ఎక్స్ 100 చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైంది పాయల్ రాజ్ పుత్. పంజాబీలో క్రేజీ స్టార్ గా ఉన్న పాయల్ టాలీవుడ్ లో ఆరంగేట్రమే బ్లాక్ బస్టర్ అందుకుంది. ప్రస్తుతం వరుసగా అవకాశాలు అందుకుంటూ క్రేజీ స్టార్ గా వెలిగిపోతోంది. విక్టరీ వెంకటేష్ – నాగచైతన్య హీరోలుగా నటిస్తున్న వెంకీ మామ చిత్రంలో పాయల్ ఓ కథానాయికగా నటిస్తోంది. రవితేజ సరసన డిస్కో రాజా చిత్రంలో .. నవతరం ట్యాలెంటుతో కలిసి `ఆరడి ఎక్స్` అనే వేరొక చిత్రంలోనూ ఆడిపాడుతోంది.

ఇక కెరీర్ సంగతి అటుంచితే పాయల్ రాజ్ పుత్ వ్యక్తిగత వ్యవహారం ఒకటి అంతర్జాలంలో వేడెక్కిస్తోంది. పాయల్ కి ఓ సీక్రెట్ బోయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఆ సంగతిని పూర్తిగా రివీల్ చేయకుండా సామాజిక మాధ్యమాల్లో తన ఫ్యాన్స్ కి ఫజిల్ వేసింది. ఇన్ స్టాగ్రమ్ లో తన చెలికాడితో ఎంతో సన్నిహితంగా ఉన్నప్పటి ఫోటో ఒకటి షేర్ చేసింది. అందులో పాయల్ అతడి పక్కనే కూర్చొని కనిపిస్తోంది. ఈ ఫోటోకి మూడు లవ్ సింబల్స్ ని జత చేసింది. దీంతో ఈ ఫోటో చూసిన వారు అతడు పాయల్ బాయ్ ఫ్రెండ్ అని ఫిక్సయిపోతున్నారు.

ఆసక్తికరంగా పాయల్ ఫ్రెండ్ అర్చనా గుప్తా `మై ఫేవరెట్ లవ్ బర్డ్స్` అని ఆ ఫోటోపై వ్యాఖ్యను పోస్ట్ చేయడంతో ఇక ఎలాంటి సందేహం లేకుండా అతడే పాయల్ బోయ్ ఫ్రెండ్ అని ఫిక్సయిపోయారంతా. నెటిజనులు ఈ ఫోటోని ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో జోరుగా వైరల్ చేస్తున్నారు. బోయ్ ఫ్రెండ్ తో దొరికినా అతడు ఎవరు అన్నది మాత్రం అర్థం కావడం లేదంటూ ఫ్యాన్స్ తలలు పట్టుకుంటున్నారు. పాయల్ ఎందుకిలా ఏడిపిస్తావ్.. ఇంతకీ ఎవరు అతగాడు? అలా దాచేయకు ప్లీజ్!
Please Read Disclaimer