మామపైనే పేలిన RDX బాంబ్

0

ఆర్.ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్ పుత్ స్పీడ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనేలేదు. నటించిన తొలి సినిమాతోనే యూత్ కి కంటిపై కునుకు కరువయ్యేలా చేసింది. ఘాటైన సన్నివేశాల్లో నటించడమే కాదు ఎక్స్ పోజింగుకి.. ఘాటైన సన్నివేశాలకు ఏమాత్రం వెనకాడని అందగత్తెగా పాయల్ కి ఓ సపరేట్ ఇమేజ్ పడిపోయింది. ఆ క్రమంలోనే ఆర్.డి.ఎక్స్ అనే ఎక్స్ ప్లోజివ్ సినిమాలోనూ నటించేసింది పాయల్. ఆ సినిమాలో నటించినందుకు భారీగా పారితోషికం ముట్టజెప్పారని ప్రచారమైంది. అయితే బీగ్రేడ్ సినిమాగా బాక్సాఫీస్ ఫలితం తేలిపోయిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం పాయల్ హోప్స్ అన్నీ వెంకీమామ పైనే. అందుకే ఈ భామ వంద శాతం ఇన్వాల్వ్ అయ్యి ఈ ప్రాజెక్టుపైనే దృష్టి సారించింది. ఇప్పటికే వెంకీ మామ ప్రమోషన్ పీక్స్ కి చేరుకుంది. డిసెంబర్ లో రిలీజ్ కానున్న ఈ సినిమాకి పాయల్ తనవంతు ప్రమోషన్ కూడా చేస్తోంది. శనివారం ఉదయం రిలీజైన వెంకీమామ లిరికల్ వీడియోలో రెట్రో లుక్ తో కనిపించి ఆకట్టుకున్న పాయల్.. ఇంతలోనే మరో కొత్త లుక్ తో ఫ్యాన్స్ ముందుకు వచ్చింది.

తాజా ఫోటోలో పాయల్ వైట్ ఫ్రాకులో అగ్గి రాజేసింది. కిల్లింగ్ లుక్ తో కిల్లర్ లేడీలా బోయ్స్ కి చెమటలు పట్టించేస్తోంది. పాయల్ లోని ఘాటైన వ్యవహారానికి యూత్ అడిక్ట్ కావాల్సిందే. అంతేకాదు.. లేటు వయసులో అయినా వెంకీమామలో ప్రేమ కోరిక పుట్టించిన ఘనత ఈ అమ్మడిదే! అంటూ సరదా కామెంట్లు చేస్తున్నారు యూత్. పాయల్ ఇలానే రెచ్చిపోతే తెర నిండుగా పండగే పండగ. పైగా వెంకీమామలో పల్లెటూరి అమ్మాయిగా కనిపిస్తూనే.. ఇలా అల్ట్రా మోడ్రన్ గా చెలరేగే అమ్మడిగానూ ట్రీటిస్తుందనే అర్థమవుతోంది. ఇప్పటికే ప్రతి రోజు పండగే చిత్రంలో రాశీ ఖన్నా లుక్ రివీలై వైరల్ గా మారింది. ఇప్పుడు పాయల్ కి సంబంధించిన ఫోటోలపైనా యువతరం అంతే ఇదిగా మాట్లాడుకుంటున్నారు. కిల్లింగ్ లుక్ తో కిల్లర్ లేడీలా దూసుకొస్తోంది. ఆర్.ఎక్స్ ఫోర్స్ తో ఆర్డీఎక్స్ గుండెల్లో పేలడం గ్యారెంటీ.
Please Read Disclaimer