సుశాంత్.. మానసిక వైద్యుని ప్రిస్కిప్షన్ దిగజార్చిందా!

0

హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అకాల మరణం బాలీవుడ్ లో కల్లోలం రేపిన సంగతి తెలిసిందే. అతని అభిమానులు.. స్నేహితులు .. కుటుంబ సభ్యులను అతడి ఆత్మహత్య తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. తిలా పాపం తలా పిడికెడు! అన్న చందంగా సుశాంత్ మరణం వెనక ఎన్నో ఘోర ఆకృత్యాలు బయటపడుతున్నాయి. అయితే అదే సమయంలో ఈ సంఘటన గత కొన్ని రోజులుగా అనేక చర్చలకు సిద్ధాంతాలకు ఆజ్యం పోసింది. సుశాంత్ తన ముంబై నివాసంలో చనిపోయాడు. తరువాత ఫోరెన్సిక్స్ నివేదిక ఆత్మహత్య అని ధృవీకరించింది.

కానీ అదే సమయంలో అతని ఫ్లాట్ నుండి ఆత్మహత్య లేఖ ఏదీ కనుగొనలేకపోవడం పలు సందేహాలకు తావిచ్చింది. సుశాంత్ సింగ్ తన జీవితాన్ని అంతం చేసుకోవాలనే నిర్ణయం వెనుక కారణం ఏమిటి? ఈ ప్రశ్న ప్రతి ఒక్కరి చెవిలో రింగుమంది. ఎన్నో ఎన్నో సందేహాల నడుమ సుశాంత్ హత్యకు గురయ్యారని ఊహాగానాలు సాగాయి. అలా ఆరోపించిన వారిలో నటి పాయల్ రోహత్గి కూడా ఉన్నారు.

సదరు నటి ఇటీవల సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేసారు. దీనిలో పరిశ్రమలోని కొంతమంది వ్యక్తులపై ఆరోపణలు చేయడం సంచలనమైంది. సుశాంత్ మరణం వెనుక కొందరు కారణమని ఆమె పేర్కొంది. పాయల్ తొలిగా సుశాంత్ సింగ్ మానసిక వైద్యుడిపై ఆరోపించారు. ప్రతి రోగికి బైపోలార్ డిజార్డర్ ఉందని రోగనిర్ధారణ చేసే అనవసరమైన అలవాటు ఆ డాక్టర్ కి ఉందని పాయల్ ఆరోపించారు. చాలా కాలం క్రితం అదే నిపుణుడిని తాను కూడా సంప్రదించానని తెలిపింది. అతడి ప్రిస్కిప్షన్ మరింత దిగజారుస్తుంది అని సంచలన వ్యాఖ్యను పాయల్ రోహిత్గి చేశారు.

పనిలో పనిగా సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తితో మహేష్ భట్ ఎఫైర్ విషయాన్ని పాయల్ ఈ సందర్భంగా ఎత్తి చూపారు. ఓ ముగ్గురు వ్యక్తులకు సుశాంత్ ఆత్మహత్యకు లింక్ ఏమిటో పాయల్ ఆ వీడియో చాట్ లో వెల్లడించారు. సుశాంత్ సింగ్ డాక్టర్ సహా దర్శకనిర్మాత మహేష్ భట్.. మరో నిర్మాత దిబాకర్ బెనర్జీ మధ్య రిలేషన్ ని కూడా పాయల్ ఎత్తి చూపించింది. సుశాంత్ సింగ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సోనమ్ కపూర్ పైనా పాయల్ రకరకాలుగా ఆరోపించారు.
Please Read Disclaimer