ఆ హత్యకు హిందూ ముస్లిమ్ కలరిచ్చి బుక్కయిన నటి!

0

సోషల్ మీడియా కల్చర్ లో ప్రతిదానికి ప్రచారం కోరుతున్నారు. హైదరాబాద్ లో డాక్టర్ ప్రియాంక రెడ్డి దారుణ హత్యోదంతం నెటిజనుల ట్రోలింగ్ కల్చర్ తో వేడెక్కిస్తోంది. అయితే దీనిపై పాయల్ రోహిత్గీ అనే హిందీ కథానాయిక ఏకంగా హిందూ ముస్లిమ్ ఇష్యూగా అభివర్ణిస్తూ సోషల్ మీడియాలో చెలరేగిపోవడంతో నెటిజనులు ఈ అమ్మడిని ఓ రేంజులో ఆడేసుకుంటున్నారు.

అంతగా ఈ అమ్మడు ఏం కెలికింది? అంటే.. ప్రియాంక హత్య జరిగినది ముస్లిముల డామినేషన్ ఉన్న ఏరియాలో. షాద్ నగర్ ఏరియాలో ముస్లిములదే పై చేయి. అక్కడ హిందూ అమ్మాయి ప్రియాంక పై హత్యాచారం జరిగింది. దీనికి ఆధారాలివిగో అంటూ కొన్ని వెబ్ లింకుల్ని ఇచ్చింది. పైగా జాతీయ మీడియా వచ్చి హిందూ ముస్లిమ్ కోణంలో కథనాలు అల్లాలని కోరింది. మొత్తానికి కెలకకూడనిది కెలికి ఈ అమ్మడు నెటిజనులకు అడ్డంగా దొరికిపోయింది.

ప్రస్తుతం ఈ హిందీ నటిపై ముంబై పోలీసులు కేసు బుక్ చేసి విచారించాలని నెటిజనులు సీరియస్ అవుతున్నారు. హిందూ ముస్లిమ్ మతాల మధ్య చిచ్చు పెడుతూ ఈ అమ్మడు చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఉన్నాయని దుయ్యబడుతూ ట్రోల్స్ చేస్తుండడం వేడెక్కిస్తోంది. పాయల్ రోహిత్గి బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించింది. నిరంతరం సోషల్ మీడియాల్లో స్పీడ్ గానే ఉంటుంది ఈ భామ. షాద్ నగర్ పరిసరాల్లోని ఔటర్ లో ప్రియాంకను ఓ నలుగురు దుర్మార్గులు దారుణంగా రేప్ చేసి హత్య చేసిన సంగతి తెలిసిందే. స్కూటీకి ప్యాచ్ అని చెప్పి రోడ్ పక్కన ఉన్న పొదల్లోకి లాక్కెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డారు. అత్యాచారం చేసి హత్య చేయడమే గాక పెట్రోల్ పోసి తగుల బెట్టిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది.
Please Read Disclaimer