ఫొటోలతో హీట్ పెంచిన పాయల్ ఘోష్

0

మంచు మనోజ్ హీరోగా నటించిన ‘ప్రయాణం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బెంగాలీ భామ పాయల్ ఘోష్. మొదటి సినిమాతోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ మధ్య పాయల్ ఘోష్ ‘కోయి జానేనా’ సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. అంతకుముందు అడపాదడపా తెలుగు చిత్రాలలో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి ఊసరవెల్లి సినిమాలో కన్పించినా అవకాశాలు మాత్రం దక్కించులోకపోయింది.

అయితే ఇప్పుడు తాను ఉన్నానంటూ గుర్తు చేయడానికి ఓ హాట్ ట్రెండీ ఫోటోషూట్ తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ మధ్య ఒక మ్యాగజైన్ ఫోటో షూట్ కోసం హాట్ గా అందాలను ఆరబోసింది. గ్లామర్ డోస్ పెంచి దర్శక నిర్మాతలకు అందాల బాణాలు విసురుతోందీ ఈ బెంగాలీ ముద్దుగుమ్మ. సోషల్ మీడియాలో తన హాట్ ఫొటోలతో హీటెక్కిస్తోంది. ప్రస్తుతం పాయల్ ఘోష్ హాట్ ఫొటోస్ సోషల్ మీడియా లో ట్రెండింగ్ లో ఉన్నాయి.

ఈ ఫోటోలపై నెటిజన్లు తమకు నచ్చిన విధంగా రకరకాల కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. ఇలా హాట్ ఫోజులతో తన కెరీర్ వేగం పెంచుకోవడానికి ప్రయత్నిస్తుందని మరికొందరు విమర్శిస్తున్నారు. ఏదేమైనా అభిమానులకు సొగసుల విందును వడ్డిస్తూ అందాలను ఆరబోస్తున్న పాయల్ ఘోష్ కు ఇప్పటి నుండి అయినా మంచి అవకాశాలు దక్కాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Please Read Disclaimer