‘మిస్ ఇండియా’ పరిస్థితి ఏంటీ?

0

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నరేంద్ర నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మిస్ ఇండియా’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. కాని థియేట్లు ఓపెన్ లేని కారణంగా సినిమా వాయిదా వేస్తూ వస్తున్నారు. మొన్నటి వరకు సినిమాను థియేటర్లలో మాత్రమే విడుదల చేయాలని భావించారు. కాని ఇప్పట్లో థియేటర్లు ఓపెన్ అయ్యే అవకాశం కనిపించడం లేదు. ఒకవేళ థియేటర్లు ఓపెన్ అయినా కూడా ప్రేక్షకులు వస్తారనే నమ్మకం లేదు. కనుక మిస్ ఇండియాను ఓటీటీలో విడుదల చేయాలనే నిర్ణయానికి మేకర్స్ వచ్చారట. కాని మొన్నటి వరకు ఈ సినిమాకు వచ్చిన బిజినెస్ ఇప్పుడు రావడం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

హీరోయిన్ కీర్తి సురేష్ కు ఉన్న క్రేజ్ నేపథ్యంలో మిస్ ఇండియాకు భారీ మొత్తాన్ని ప్రముఖ ఓటీటీ ఆఫర్ చేసిందట. ఆ సమయంలో సినిమాను థియేటర్లలో విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో ఆ ఆఫర్ ను నిర్మాత కాదన్నారట. ఇప్పుడు సినిమాను ఓటీటీలో విడుదల చేయాలనుకుంటే మొన్నటి వరకు ఆఫర్ చేసిన మొత్తాన్ని ఇచ్చేందుకు సదరు ఓటీటీ సిద్దంగా లేదట. ఇటీవల కీర్తి సురేష్ నటించిన పెంగ్విన్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా నిరాశ పర్చింది.

ఆ సినిమా ఫలితం కారణంగా ప్రేక్షకులు కీర్తి సురేష్ సినిమా అంటే పెద్దగా ఆసక్తి చూపించడం లేదని.. అందుకే మిస్ ఇండియా క్రేజ్ తగ్గిందనే టాక్ వినిపిస్తుంది. మొదట కోట్ చేసిన అమౌంట్ ను దాదాపుగా 30 శాతం తగ్గించి ఇస్తామని ఇప్పుడు నిర్మాతతో బేరసారాలు సాగిస్తున్నారట. కాని మిస్ ఇండియా చిత్ర మేకర్స్ మాత్రం సినిమాపై ఉన్న నమ్మకంతో భారీ మొత్తంను డిమాండ్ చేస్తున్నట్లుగా టాక్. ప్రస్తుతానికి మిస్ ఇండియా బిజినెస్ చర్చలు జరుగుతున్నాయి.

పెంగ్విన్ కారణంగా మిస్ ఇండియాతో పాటు కీర్తి సురేష్ నటిస్తున్న మరో సినిమా అయిన గుడ్ లక్ సఖి సినిమా కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నగేష్ కుకనూరు దర్శకత్వంలో గుడ్ లక్ సఖి చిత్రం రూపొందుతున్న విషయం తెల్సిందే. పెంగ్విన్ సినిమాతో కీర్తి సురేష్ మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందనేది ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. మళ్లీ సక్సెస్ తో కీర్తి సురేష్ పుంజుకుంటుందా చూడలి.
Please Read Disclaimer