ఆర్జీవీ సెటైరికల్ ట్వీట్ ఎవరిని ఉద్దేశించి వేశాడు…?

0

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా మాధ్యమాలలో ఎంత యాక్టీవ్ గా ఉంటాడో అందరికి తెలిసిందే. కాంట్రవర్శీలకు కేరాఫ్ అడ్రస్ అయిన ఆర్జీవీ కాంట్రవర్శీ కింగ్ గా పిలవబడుతుంటాడు. ఎప్పుడూ ఎదో ఒక విషయం పై వ్యంగ్యంగా స్పందించడం ఆర్జీవికి అలవాటు. సోషల్ మీడియా అనేది ఈయన వాడకానికే పుట్టిందా అనే రేంజ్ లో వాడుతుంటారు. ఆఖరుకు తన సినిమాల్ని కూడా సోషల్ మీడియా వేదికగానే ఎక్కువగా ప్రచారం చేసుకుంటుంటారు వర్మ. అదీ ఇదీ అని లేకుండా వివిధ అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తూ సమాజంలో జరిగే అనేక విషయాల మీద ఫోకస్ పెట్టి తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెబుతుంటాడు. ప్రస్తుతం కరోనా వైరస్ దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కరోనాపై వరుస ట్వీట్లు చేస్తూ వార్తల్లో ఉంటూ వస్తున్నాడు వర్మ. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ట్వీట్లతో నెటిజన్స్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూనే వున్నారు. రామ్ గోపాల్ వర్మ ఎటువంటి విచిత్రమైన వ్యక్తో ఆయన వేసే ట్వీట్స్ చూస్తే అర్థమవుతుంది. సామాన్యులకు ఏ మాత్రం అర్థం కాని విధంగా అంతుచిక్కని చిక్కు ప్రశ్నల్లా అనిపించే వాటిలో నిగూఢంగా ఓ సెటైర్ దాగి ఉంటుంది. అదే ఆర్జీవీ స్టైల్. ఆయన ఎప్పుడు ట్వీట్ చేసినా అదొక వార్త అవుతుంది.. సంచలనం అవుతుంది. అది డోనాల్డ్ ట్రంప్ అయినా నరేంద్రమోడీ అయినా కేసీఆర్ అయినా సినీ హీరోలైనా.. ఎవ్వరైనా సరే వర్మ ట్వీట్ శైలి మాత్రం మారదు. ఇప్పుడు మరో వెటకారపు ట్వీట్ తో మన ముందుకు వచ్చాడు.

తాజాగా ఆయన వేసిన ఈ ట్వీట్ ఎవరిని ఉద్దేశించినదో నెటిజన్లకు అర్థం కావడం లేదు. ”వావ్ నువ్వు ఎప్పటికీ గొప్ప తెలివగల వాడివి.. నీ విశ్లేషణా సామర్థ్యం ముందు ఐన్ స్టీన్ కూడా మూగబోయేవాడు.. నీ బుద్ధికి మెగా బ్రిలియన్స్ కు కుడోస్” అంటూ ఓ ట్వీటేశాడు ఆర్జీవీ. ఎవరిని ఎప్పుడు ఎలా గిల్లాలో రామ్ గోపాల్ వర్మకు తెలిసినంతగా మరెవరికి తెలియదు అంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఈ ట్వీట్ తో ఎవరిని గిల్లాడో అని ట్వీటకులు ఆలోచిస్తున్నారు. ఆర్జీవీ ట్వీట్ ఇప్పుడు వైరల్ అయింది. సోషల్ మీడియాలో ఈయన గెలకని సెలెబ్రెటీ ఉండడు.. సినిమాలతో కంటే ఇలా సెలబ్రిటీలను ట్రోల్ చేస్తూ ఎక్కువగా వార్తల్లో ఉంటాడు. అందుకే ఇప్పుడు ఎవరో సెలబ్రిటీని గెలికాడంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఆర్జీవీ ట్వీట్ ఎవరి మీదో సెటైర్ అని అర్థం అవుతోంది.. కానీ అది ఎవరని ఒక పజిల్ పూర్తి చేస్తున్నట్లు ఆలోచిస్తున్నారు నెటిజన్స్. ఇక వర్మ చేసిన ఈ ట్వీట్ ఎవరిని ఉద్దేశించినదో తెలీక కొందరు నెటిజన్లు తలలు పట్టుకుంటే.. మరి కొందరు మాత్రం డోనాల్డ్ ట్రంప్ గురించి అని.. నరేంద్ర మోడీ గురించి.. కాదు టాలీవుడ్ లోని హీరోల గురించి అని రకరాలుగా కామెంట్స్ పెడుతూ ఉన్నారు. మరి ఆర్జీవీ మైండ్ లో ఉన్న ఆ బ్రిలియంట్ పర్సన్ ఎవరో ఆయనకే తెలియాలి.

Wowwwww u are the the Most Fantastically Amazing Genius Ever..Albert Einstein would be a dumb Idiot in front of ur analysing power ..Kudos to ur intellectual mega brilliancePlease Read Disclaimer


మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home