హీరోలకు చెమడాలు వొలిచిండు

0

ఓరి బాబోయ్ ఇవేం తిట్లు..! మడిషన్నాక తిట్టాలి.. ఆ తిట్లు కూడా కళాత్మకంగా ఉండాలి! అంతే కానీ మరీ ఇంతగానా? చెవులు చిల్లులు పడిపోతుయాయ్. ఆ తిట్లు వినేవాళ్లకు మాట పడిపోయింది. చూసేవాళ్లు కళ్లతో పాటు చెవులు కూడా మూసుకున్నారు. ఇంతకీ ఆయనెవరు ఎందుకు తిట్టారు? అన్నదానికంటే ఆయన ఎవరిని తిట్టాడు? ఏ కాజ్ కోసం తిట్టాడు? అన్నది ఇక్కడ పాయింట్.

హైదరాబాద్ అమ్మాయి.. డాక్టర్ ప్రియాంక రెడ్డి దారుణ హత్యాచారంపై దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆగ్రహం పెళ్లుబికుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి మృగాళ్లను పబ్లిక్ లో ఉరి తీయాలని మీడియా గొట్టాల ముందు ప్రజల్లో ఆవేశం చూస్తుంటే ఇంతగా కట్టలు తెంచుకునే ఆవేశమా? అనిపించక మానదు. జరిగిన దారుణం ఆ ఆవేశాన్ని రగిలించింది. అది సహజంగా పుట్టుకొచ్చిన ఆవేశం. రక్తం మరిగించే ఆవేశం.

ఇదిగో ఈ యువకుడిలోనూ అదే కనిపిస్తోంది. అయితే ఆ ఆవేశం కాస్తా దారి తప్పి సినీ హీరోల మీదకు మళ్లింది. ఎవడ్రా అరేయ్ ఒరేయ్.. ఇప్పుడు రండ్రా.. వీళ్లను నరకండ్రా! అంటూ అతగాడు ఎమోషన్ తట్టుకోలేక అరుస్తున్న తీరు చూస్తుంటే .. ఈ కోపం హీరోలపైకే ఎందుకు మళ్లింది? అన్న సందేహం కలుగుతోంది. అతడు తిట్టేసింది అట్టాంటిట్టాంటి స్టార్లను కాదు. ఏకంగా మెగాస్టార్ చిరంజీవి.. ఎన్టీఆర్.. రవితేజ.. ప్రభాస్ అంటూ అందరినీ పేరు పేరునా తిట్టేశాడు. వీళ్లు నటించిన సినిమాల పేర్లతో సహా తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు. అతడి ఎమోషన్ చూస్తుంటే పోసానికి డూప్ లా అనిపించాడు. వదిలితే ఆవేశంతో ఏదైనా చేస్తాడా? అన్నంతగా కనిపిస్తున్నాడు. అతడి ఆవేశంలో ఓ కొత్త అర్థం కూడా కనిపించింది. స్టార్లు ఎంతసేపూ సంపాదించుకోవడమేనా.. ఇలాంటివి జరిగినప్పుడు స్పందించరా.. వచ్చి నిజమైన హీరోలుగా ఏం చేస్తారో చేయండి! అన్న ఇంటెన్షన్ కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో ఫ్యాన్స్ సామాజిక మాధ్యమాల్లో జోరుగా వైరల్ అవుతోంది.
Please Read Disclaimer