పవన్ బ్యూటీ డేటింగు కి ప్రైవసీ కావాలట!

0

డేటింగ్ అనేది బాలీవుడ్ భామలకు సర్వ సాధారణంగా మారిపోయిన విషయం తెలిసిందే. క్రేజ్ కోసం కూడా డేటింగ్ చేస్తున్నామంటూ నిత్యం వార్తల్లో నిలవడానికి ముంబై ముద్దు గుమ్మలు తెగ ఆరాటపడుతున్నారు. కొన్ని సార్లు ఈ ప్లాన్ వర్కవుటై పాపులరైన భామలు వున్నారు. ఇటీవల ఈ తరహా డేటింగ్ సంస్కృతి గతంతో పోలిస్తే మరీ ఎక్కువైంది. పాపులర్ కావడం కోసమే అన్నట్టుగా హీరో హీరోయిన్స్ డేటింగ్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు.

తాజాగా ఈ జాబితాలో పవన్ హీరోయిన్ కృతి కర్బందా చేరింది. `తీన్మార్` సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన ఈ ఉత్తరాది చిన్నది ఆ తరువాత ఇక్కడ అంతగా రాణించలేకపోయింది. బాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే బిజీ అవుతున్న కృతి తాజాగా డేటింగ్ పేరుతో జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ కుర్ర హీరో పులకిత్ సమ్రాట్ తో కృతి గత కొంత కాలంగా డేటింగ్ చేస్తోంది. ఈ విషయాన్నే బహిరంగంగా ప్రకటించి బాలీవుడ్ సెలబ్రిటీల తో పాటు అభిమానులకు షాకిచ్చింది. అయితే డేటింగ్ లో వున్నానని చెప్పినా రూమర్స్ ఆగకపోవడంతో కృతి కి చిర్రెత్తుకొచ్చింది.

దీంతో మీడియాను చెడామడా కడిగేసిన కృతి డేటింగ్ విషయాన్ని ముందే చెప్పేశాం. ఇంకా దాచేందుకు ఏమీ లేనప్పుడు ఈ పుకార్లు ఎందుకు పుట్టిస్తున్నారు. మాకు కాస్త ప్రైవసీ ని ఇవ్వండి. నిత్యం వార్తల్లో వుంటే మా ఇరు కుటుంబాలకు కూడా మంచిది కాదు. అందుకే మాకు కాస్త ప్రైవసీని ఇవ్వండి అంటూ సీరియస్ అయ్యింది. పులకిత్ కూడా కృతి తరహాలోనే మీడియాను కోరడం బాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది.
Please Read Disclaimer