మహేష్ – రష్మిక కెమిస్ట్రీ పీక్స్!

0

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఈ సినిమాకు ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. పోస్టర్లు.. టీజర్.. లిరికల్ సాంగ్స్ రిలీజ్ చేస్తూ సినిమా పై హైప్ పెంచుతున్నారు. ఈరోజు క్రిస్మస్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ‘సరిలేరు నీకెవ్వరు’ టీమ్ కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది.

ఈ పోస్టర్లో మహేష్ బాబు ను వెనుకనుంచి హీరోయిన్ రష్మిక మందన్న ప్రేమగా కౌగలించుకుంది. రష్మిక చేతిని ప్రేమగా పట్టుకున్న మహేష్ ఎప్పటిలాగే హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారు. రష్మిక మాత్రం తన దృష్టి అంతా మహేష్ పై పెట్టి ఒక రకమైన తన్మయత్వంతో కనిపిస్తోంది. ‘సరిలేరు నీకెవ్వరు’ నుంచి విడుదలైన ఫస్ట్ రొమాంటిక్ పోస్టర్ ఇది. మొదట్లో రష్మికకు ప్రమోషన్స్ లో ప్రాధాన్యం ఇవ్వలేదనే టాక్ వినిపించింది కానీ ఈ పోస్టర్ చూస్తుంటే అదంతా ఏమీ లేదని రష్మికకు ప్రాధాన్యం ఉందనే విషయం అర్థం అవుతుంది. పోస్టర్ లో మహేష్ – రష్మిక మధ్య కెమిస్ట్రీ మాత్రం పీక్స్ లో ఉంది.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా లో విజయశాంతి.. ప్రకాష్ రాజ్.. రాజేంద్రప్రసాద్.. సంగీత.. హరితేజ.. బండ్ల గణేష్.. వెన్నెల కిషోర్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. దేవీ శ్రీప్రసాద్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. ఈ సినిమాను అనిల్ సుంకర – దిల్ రాజు – మహేష్ బాబు సంయుక్తంగా నిర్మించారు.
Please Read Disclaimer