గేమ్ ఆఫ్ త్రోన్స్ ఫ్యాన్స్ కు ఇదో సర్ ప్రైజ్!

0

హాలీవుడ్ సినిమాలను రెగ్యులర్ గా చూసేవారికి పీటర్ డింక్లేజ్ పేరును పరిచయం చేయనవసరం లేదు. నాలుగు అడుగుల ఐదు అంగుళాల పొడవు మాత్రమే ఉండే పీటర్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. ‘X -మెన్: డేస్ ఆఫ్ ఫ్యూచర్ పాస్ట్’.. ‘ఆవెంజర్స్: ఇన్ఫినిటీ వార్’ లాంటి ఎన్నో సూపర్ హిట్ ఫిలిమ్స్ లో నటించారాయన. ఇక న్యూ జెనరేషన్ ఆడియన్స్ కు ‘గేమ్ ఆఫ్ త్రోన్స్’ సీరీస్ లో టైరియన్ ల్యానిస్టర్ గా ఆయన తెలుసు. అంతే కాదు.. పొట్టిగా ఉండడం అనేది లోపంగా భావించి.. మేమేమీ సాధించలేమని కుంగిపోయే చాలామందికి అయన ఓ పెద్ద ఇన్స్పిరేషన్.

ఇప్పుడు ఆయన టాపిక్ ఎందుకు వచ్చిందంటే.. సరిగ్గా పీటర్ డింక్లేజ్ ను పోలిన ఒక వ్యక్తి పాకిస్తాన్ లో ఉన్నాడు. ముఖకవళికలు మాత్రమే కాదు హైట్ కూడా సేమ్ టూ సేమ్. రావల్పిండి నగరంలో ఒక రెస్టారెంట్ లో వెయిటర్ గా పనిచేసే రోజీ ఖాన్ పీటర్ డింక్లేజ్ పోలికలు ఉండడంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు. ఆ రెస్టారెంట్ ఓనర్ మాలిక్ అస్లాం పర్వేజ్ కూడా ఈ రోజి ఖాన్ అలా ఉండడంతో సంతోషంగా ఉన్నాడు. రోజి ఖాన్ వల్ల తమకు కస్టమర్లు పెరిగారని.. ఒకరోజు ఆయన కనుక శెలవు తీసుకుంటే కస్టమర్లు “ఖాన్ ఎక్కడ.. ఎక్కడ?” అని అడుగుతారని అంటున్నారు. ఆ హోటల్ కు తరచుగా వచ్చే కొందరు యువకులు ఖాన్ ను చూస్తే తమకు ల్యానిస్టర్ ను చూసిన అనుభూతి కలుగుతుందని అంటున్నారు. రోజీ ఖాన్ కు కూడా ఈ విషయం తెలుసు. అందుకే ఎప్పటికైనా హాలీవుడ్ స్టార్ పీటర్ డింక్లేజ్ ను ఒకసారి కలవాలని ఉందని అంటున్నాడు.

మనిషిని పోలిన మనుషులు ఆరుగురో ఏడుగురో ఉంటారని పెద్దవాళ్ళు అంటుంటారు. మరి పీటర్ డింక్లేజ్ బ్యాచ్ లో ఒకరు పాకిస్తాన్ లో ఉన్నారు. మరి మిగతా పీటర్లు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో..?
Please Read Disclaimer