సౌకర్యం ముఖ్యమట!

0

తెలుగు ప్రేక్షకులకు స్వాతి రెడ్డి పేరును పరిచయం చెయ్యనవసరం లేదు. టీనేజ్ లోని యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ‘కలర్స్’ స్వాతిగా తెలుగు టీవీ ప్రేక్షకులలో చాలా పాపులారిటీ సాధించింది. ఆ తర్వాత హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి చాలా హిట్ సినిమాల్లో నటించింది. ‘కార్తికేయ’ లాంటి సినిమాలు కూడా స్వాతి ఫిల్మోగ్రఫీలో ఉన్నాయి. కొంత కాలం క్రితం వికాస్ అనే పైలట్ ని పెళ్లి చేసుకొని ఇండోనేషియాలో సెటిల్ అయింది. స్వాతి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

రీసెంట్ గా తన ఇన్స్టా ఖాతా ద్వారా రెండు ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలకు పెద్ద క్యాప్షన్ కూడా ఇచ్చింది. చెప్పుల గురించి మాట్లాడుతూ తక్కువ మెయింటెనెన్స్ అంటే తక్కువ స్థాయి కాదు. తక్కువ ఖర్చు అనేది ఆత్మవిశ్వాసం నుంచి వస్తుంది. అదే తక్కువ స్థాయి అనేది ఏదో చూపించుకోవాలన్న అనవసర తపన.. విశ్వాసం లేకపోవడం నుంచే వస్తుంది. అందుకే అందంగా కనిపించడం కంటే సౌకర్యంగా ఉండడమే సరైనదని నేను అనుకుంటున్నా.. అందే ఎంచుకున్నాను అని తెలిపింది. అర్థం అయింది కదా.. అదేదో బ్రాండ్ షూ ధరిస్తేనే గొప్ప.. లేకపోతే లేదు అనుకుంటూ ఉంటారు. కానీ మనకు ఏది సౌకర్యంగా ఉంటుందో అదే మేలని చెప్తోంది. అందరూ ఏకీభవించకపోవచ్చు కానీ చాలామంది ఒప్పకుంటారు.

ఇక ఫోటో విషయానికి వస్తే అందమైన ఆకుపచ్చ రంగు గౌన్ ధరించి పొడవాటి అద్దం ముందు సెల్ఫీ తీసుకుంది. ఫోటోలో నాజూకుగా కనిపిస్తోంది. చేతికి వాచీ ధరించి.. ఎంతో క్యాజువల్ గా కనిపిస్తోంది. సినిమాల విషయానికి వస్తే స్వాతి ప్రస్తుతం ‘త్రిస్సూర్ పూరం’ అనే మలయాళం సినిమాలో నటిస్తోంది.
Please Read Disclaimer